Hina khan Health: బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటూ మ్యూకోసైటిస్ బారిన పడిన హీనా ఖాన్, ఏమిటీ మ్యూకోసైటిస్?
Hina khan Health: హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తనకు కొత్త సమస్య వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీని పేరు మ్యూకోసిటిస్. ఈ సమస్య ఏమిటో తెలుసుకోండి.
హిందీ సీరియల్, బిగ్ బాస్ ద్వారా హీనా ఖాన్ ఎక్కువ మందికి పరిచయమే. ఆమె రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 3 లో ఉన్నట్టు ఆమె కొన్ని రోజుల క్రితమే బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ చేయించుకుంటోంది. ఈ సమయంలో ఆమె తన హెల్త్ గురించి ఎప్పటి కప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తాను మ్యూకోసిటిస్ తో పోరాడుతున్నానని ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఈ సమస్య కారణంగా ఆహారం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని తన బాధాకరమైన పరిస్థితుల గురించి ఈ పోస్ట్ లో చెప్పింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె మ్యూకోసైటిస్ తగ్గడానికి కొన్ని హోం రెమెడీస్ గురించి నెటిజన్లను అడిగి తెలుసుకున్నారు. అటువంటి పరిస్థితిలో, మొదట మ్యూకోసిటిస్ అంటే ఏమిటి? దానిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
మ్యూకోసైటిస్ ఎప్పుడు వస్తుంది?
రేడియేషన్ లేదా కెమోథెరపీ వంటి క్యాన్సర్లకు చికిత్స పొందుతున్న వ్యక్తులు సాధారణంగా మ్యూకోసిటిస్ బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. శ్లేష్మం ఎర్రగా మారి మ్యూకోసిటిస్ సమస్య వస్తుంది. దీని వల్ల నోటిలో పుండ్లు ఏర్పడతాయి. ఈ సమస్య వల్ల తినడం, త్రాగటం కష్టమవుతుంది.
మ్యూకోసిటిస్ లక్షణాలు
వ్యక్తి వ్యక్తికి మ్యూకోసిటిస్ లక్షణాలు మారవచ్చు. ఈ సమస్యను గుర్తించే కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి.
- నోరు, చిగుళ్ళు ఎర్రగా మారుతాయి
- నోటిలో రక్తం కనిపిస్తుంది
- చిగుళ్ళు, నాలుక, నోటిలో పుండ్లు కనిపిస్తాయి
- నోరు లేదా గొంతు నొప్పి వస్తుంది
- మింగడం లేదా మాట్లాడటం కష్టంగా మారుతుంది
- ఆహారం తినేటప్పుడు నోరు పొడిబారడం, మంటగా అనిపించడం, నొప్పిగా అనిపించడం జరుగుతుంది.
- నోటిలో లేదా నాలుకపై తెల్లని మచ్చలు వస్తాయి, చీము కూడా పట్టవచ్చు.
- నోటి నుంచి శ్లేష్మం వస్తూ ఉంటుంది. లాలాజలం చిక్కగా మారుతుంది.
మ్యూకోసిటిస్ వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి?
1) నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మ్యూకోసిటిస్ తీవ్రతను నివారించడానికి లేదా తగ్గించడానికి నోరు శుభ్రంగా ఉంచడం చాలా అవసరం.
2) తిన్న తర్వాత, నిద్రకు ముందు మెత్తగా ఉండే టూత్ బ్రష్ తో దంతాలు తోముకోవాలి. బ్రష్ వాడడం నొప్పిగా అనిపిస్తే ఓరల్ కేర్ స్వాబ్ ఉపయోగించవచ్చు.
3) మాయిశ్చరైజర్ రాసి పెదాలను తేమగా ఉంచుకోవాలి.
4) వేడిగా, కారంగా, పుల్లగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. ఆల్కహాల్, క్రస్టీ బ్రెడ్, చిప్స్, క్రాకర్స్ వంటి గట్టి ఆహార పదార్థాలను నివారించండి.
5) ద్రవాహారం అధికంగా తీసుకోండి.
6) మీ ఆహారంలో అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని చేర్చడానికి ప్రయత్నించండి.
ఇలా చేయండి
హీనా ఖాన్ పెట్టిన పోస్టుకు కొంతమంది నెటిజన్లు సమాధాన మిచ్చారు. మ్యూకోసైటిస్ తగ్గడానికి కొన్ని సూచనలు ఇచ్చారు.
- కొబ్బరి నీళ్లు, బీట్ రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్, కస్టర్డ్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని యూజర్ కామెంట్ చేశారు.
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని యూజర్ సూచించాడు. దీనితో గార్గిల్ సోడా సెలైన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ సోడా, 1/8 ఉప్పు మిక్స్ చేసి గార్గిల్ చేయాలి.