Pre Workout Breakfast Recipes : వర్కౌట్ చేసే ముందు ఇవి తినండి.. ఎందుకంటే..
12 January 2023, 7:03 IST
- Pre Workout Breakfast Recipes : ఉదయాన్నే మిమ్మల్ని వర్కౌట్‌కి సిద్ధంచేసే, ఫుల్ ఎనర్జీనిచ్చే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు ఏది పడితే అది తినకూడదు. మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ.. ఎనర్జీనిచ్చే ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. అందుకే మీ కోసం కొన్ని ప్రీ-వర్కౌట్ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఉన్నాయి. ఓ లుక్కేయండి.
ప్రీ-వర్కౌట్ బ్రేక్‌ఫాస్ట్
Pre Workout Breakfast Recipes : మీరు ఉదయాన్నే వర్కవుట్ చేయడానికి మేల్కొన్నప్పుడు.. మీ శరీరంలో శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలానే వెళ్లి వర్కౌట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. మీరు ఆహారం తీసుకోకుండా రాత్రంతా నిద్రపోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి మీరు వ్యాయామం చేసినప్పుడు.. మీ ఉదయానికి ఆజ్యం పోసేందుకు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
అందుకే మీరు వర్కౌట్‌కి వెళ్లేముందుక తీసుకోవాల్సిన కొన్ని ప్రీ-వర్కౌట్ బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు ఇక్కడున్నాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. అంతేకాకుండా ఇవి మీరు మీ ఫిట్‌నెస్ కార్యాచరణను మరింత ఆనందదాయకంగా చేయడానికి సహాయం చేస్తాయి.
కొబ్బరి, బ్లూబెర్రీ, డేట్ స్మూతీ
కొబ్బరి, బ్లూబెర్రీ, ఖర్జూరపు స్మూతీని తయారు చేయడానికి.. ఒక అరకప్పు బ్లూబెర్రీస్‌ని.. మీడియం అరటిపండ్లు, ఒక ఖర్జూరాన్ని వేసి బ్లెండర్‌లో కలపండి. ¼ కప్పు కొబ్బరి పాలు పోసి.. అన్ని పదార్థాలను మృదువైనంత వరకు కలపండి.
ఈ స్మూతీని ఒక గ్లాసులో పోసి.. కావాలంటే ఐస్ క్యూబ్స్ వేయండి. మీ బ్లూబెర్రీ కొబ్బరి పాలు స్మూతీ తినడానికి సిద్ధంగా ఉంది.
మింట్ చిప్ స్మూతీ బౌల్
¼ కప్పు బాదం పాలు.. ఒక అరటిపండు, ఒక వంతు అవకాడో, ఒక కప్పు బేబీ స్పినాచ్, ఒక టేబుల్ స్పూన్ కోకో నిబ్స్, రెండు టేబుల్ స్పూన్ల బాదం బటర్ తీసుకోండి.
కోకో నిబ్స్, బాదం బటర్ మినహా వాటన్నింటినీ.. బ్లెండర్లో వేసి బాగా కలపండి. కోకో నిబ్స్, బాదం బటర్ తో పైన గార్నిష్ చేయండి.
బాదం బటర్ చియా టోస్ట్
బ్రెడ్‌ను టోస్ట్ చేసి దానిపై కొంచెం బాదం బటర్ వేయండి. దాని పైన అరటిపండ్లు ముక్కలు చేసి, కొన్ని చియా గింజలను చల్లుకోండి. కొంచెం తేనె వేయండి. మీకు కావాలంటే బాదం బటర్ని.. వేరుశెనగ బటర్ తో భర్తీ చేయవచ్చు.
మీరు మీ టోస్ట్‌కు రుచిగా ఉండేలా చాక్లెట్ చిప్స్, కొబ్బరి రేకులు, బెర్రీలు, కాల్చిన అవిసె గింజలు లేదా చాక్లెట్ సాస్ వంటి టాపింగ్స్‌ను కూడా జోడించవచ్చు.