RC15 Update: వెకేషన్‌లోనూ చెమటలు చిందిస్తున్న రామ్ చరణ్.. వర్కౌట్‌ విషయంలో తగ్గేదేలే-ram charan set to prepare for shankar movie rc15 new zealand schedule ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc15 Update: వెకేషన్‌లోనూ చెమటలు చిందిస్తున్న రామ్ చరణ్.. వర్కౌట్‌ విషయంలో తగ్గేదేలే

RC15 Update: వెకేషన్‌లోనూ చెమటలు చిందిస్తున్న రామ్ చరణ్.. వర్కౌట్‌ విషయంలో తగ్గేదేలే

Maragani Govardhan HT Telugu
Nov 17, 2022 04:55 PM IST

RC15 Update: రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం చరణ్ కసరత్తలు మొదలుపెట్టేశారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ న్యూజిలాండ్‌లో త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తన దేహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు మన మెగాపవర్ స్టార్.

రామ్ చరణ్
రామ్ చరణ్

RC15 Update: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఆచార్యతో నిరాశ పరిచినా ఆర్ఆర్ఆర్‌తో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఇటీవలే జపాన్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లో వసూళ్ల సునామీని సృష్టించింది. ఇదే జోరులో చరణ్ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తలు మొదలెట్టేశారు. శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న RC15 షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు.

ఆర్‌సీ15 కోసం రామ్ చరణ్ వర్కౌట్లు మొదలెట్టారు. న్యూజిలాండ్ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభకానుండటంతో వర్కౌట్ పరంగా అస్సలు రాజీ పడట్లేదు చరణ్. వెకేషన్‌లో ఉండి కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ.. ట్రైనర్‌తో కలిసి చెమటలు చిందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయానా రామ్ చరణే షేర్ చేశారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్న సినిమాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం