RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ క‌న్ఫార్మ్ చేసిన రాజ‌మౌళి-rajamouli confirms rrr sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajamouli Confirms Rrr Sequel

RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ క‌న్ఫార్మ్ చేసిన రాజ‌మౌళి

Nelki Naresh Kumar HT Telugu
Nov 13, 2022 12:03 PM IST

RRR Sequel: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్

RRR Sequel: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ రానుంది. ఆర్ఆర్ఆర్ -2 తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. చికాగోలో జ‌రిగిన ఆర్ఆర్ఆర్ స్పెష‌ల్ స్క్రీనింగ్‌కు రాజ‌మౌళి గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ 2పై ఆయ‌న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం త‌న తండ్రి, రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు రాజ‌మౌళి పేర్కొన్నాడు. త‌న సినిమాల‌న్నింటికి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ల‌ను అందిస్తుంటార‌ని, ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి త‌మ మ‌ధ్య డిస్క‌ష‌న్స్ జ‌రిగిన‌ట్లు, సీక్వెల్ క‌థ‌ను త‌యారు చేసే ప‌నిలో తండ్రి ఉన్న‌ట్లు రాజ‌మౌళి పేర్కొన్నాడు. సీక్వెల్ గురించి రాజ‌మౌళి అనౌన్స్‌చేయ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

ఈ సీక్వెల్ ఎప్పుడు మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌న్న‌ది మాత్రం రాజ‌మౌళి వెల్ల‌డించ‌లేదు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. ఈ ఏడాది మార్చి 25న రిలీజైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఇందులో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇద్ద‌రు పోరాట యోధులు క‌లిసి బ్రిటీష‌ర్స్‌పై సాగించిన పోరాటాన్ని హై ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ అంశాల‌తో రాజ‌మౌళి అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా ఇండియా త‌ర‌ఫున అఫీషియ‌ల్‌గా ఆస్కార్ ఎంట్రీని ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ చివ‌రి నిమిషంలో నిరాశ ఎదురైంది. దాంతో ఇండివిడ్యూవ‌ల్‌గా ఆస్కార్ అవార్డ్స్ కోసం చిత్ర యూనిట్ అప్లై చేసింది. క్యాంపెయిన్ మొద‌లుపెట్టింది.

ఇటీవ‌లే జ‌పాన్‌లో రిలీజైన ఈ సినిమా అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. వ‌చ్చే ఏడాది ఈ సినిమా మొద‌లుకానుంది. మ‌హేష్‌బాబు సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఆర్ ఆర్ ఆర్ 2 సెట్స్‌పైకి వ‌చ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

IPL_Entry_Point