తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cardamom Water Benefits : ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగితే అద్భుతాలు

Cardamom Water Benefits : ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగితే అద్భుతాలు

Anand Sai HT Telugu

02 December 2023, 14:15 IST

google News
    • Cardamom Water Benefits In Telugu : మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మనం తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారాలు ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో ఒకటి ఏలకులు.
ఏలకులు
ఏలకులు

ఏలకులు

మన ఇంటి వంటగదిలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక పదార్థాలు ఉన్నాయి. అందులో ఏలకులు ఒకటి. ఈ ఏలకులు ఆహారానికి మంచి సువాసన, రుచిని అందించడమే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. ఏలకులు సాంప్రదాయకంగా అనేక సమస్యలకు చికిత్స చేయడానికి ఔషదాల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి ఏలకులను వంటలో కలుపుకోవడమే కాకుండా, ఉదయాన్నే నిద్రలేచి నీళ్లలో మరిగించి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని తెలుసా? ఏలకుల నీటిని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.

జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి, ఉదయం కాఫీ లేదా టీకి బదులుగా ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల జీర్ణ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అజీర్ణం నివారిస్తుంది.

మీరు మీ శరీరాన్ని శుభ్రపరచడానికి అద్భుతమైన పానీయం కోసం చూస్తున్నట్లయితే, ఉదయం ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగండి. ఏలకులు శరీరం నుండి టాక్సిన్స్, అదనపు నీటిని బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగండి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం మెరుగై, అదనపు క్యాలరీలను కరిగించి, త్వరగా శరీర బరువులో మంచి మార్పు వస్తుంది. ప్రధానంగా ఈ నీటిని నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే బరువులో మంచి మార్పు కనిపిస్తుంది.

మీరు తీవ్రమైన నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారా? అలాంటప్పుడు ఉదయాన్నే ఏలకుల నీళ్లు తాగాలి. అందువల్ల ఏలకులలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నోటి దుర్వాసనను నివారించి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

చర్మ సమస్యలతో బాధపడేవారు రోజూ ఏలకుల నీటిని తాగాలి. ఏలకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ప్రీ-రాడికల్స్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మానికి చక్కని మెరుపును అందిస్తాయి.

అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగాలి. అధ్యయనాల ప్రకారం, ఏలకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. హై బీపీ ఉన్నవాళ్లు ఈ డ్రింక్ తాగడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

ఏలకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున ఈ ఏలకుల నీటిని తాగితే గొంతు బొంగురుపోవడం, గొంతు పొడిబారడం వంటి వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

తదుపరి వ్యాసం