తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Birthday Wishes : మీ జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Happy Birthday Wishes : మీ జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Anand Sai HT Telugu

21 April 2024, 17:00 IST

    • Happy Birthday Wishes In Telugu : మనం ప్రేమించే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే విధానం అందంగా ఉండాలి. వారికి చెప్పే మాటలు జీవితాంతం గుర్తుండిపోవాలి. అలాంటి విషెస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి.
హ్యాపీ బర్త్ డే విషెస్
హ్యాపీ బర్త్ డే విషెస్ (Unsplash)

హ్యాపీ బర్త్ డే విషెస్

కొందరు ప్రేమించి, పెళ్లి చేసుకునేంత వరకు మాత్రమే తమ పుట్టినరోజులను ఘనంగా జరుపుకుంటారు. ఆ తర్వాత వారి పుట్టినరోజుల కంటే.. భాగస్వామి బర్త్ డేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే మీ జీవిత భాగస్వామి పుట్టిన రోజును ఎంత అద్భుతంగా చెబితే అంత మంచిది. ఎందుకంటే వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మీతో ఆనందంగా గడుపుతారు.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

జీవిత భాగస్వామి పుట్టినరోజు సమీపిస్తున్న కొద్దీ.. చాలా ప్లాన్ చేస్తాం. కేక్ ఎలా ఉండాలి, ఏ డిజైన్‌లో ఉండాలి, డెకరేషన్ నుండి అన్నీ ప్లాన్ చేసుకుంటాం. స్పెషల్ గ్రీటింగ్స్ కోసం చూస్తాం. అయితే ఈరోజుల్లో గ్రీటింగ్ కార్డ్ తక్కువ, మెసేజ్‌లు ఎక్కువ. మెసేజ్ ద్వారా మీ భాగస్వామికి అందమైన శుభాకాంక్షలను పంపడానికి ఇక్కడ కొన్ని లైన్లు ఉన్నాయి..

హ్యాపీ హ్యాపీ హ్యాపీ.. నీతో ఉంటే నా లైఫ్ అంతా హ్యాపీ. నా జీవిత భాగస్వామికి జన్మదిన శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ నువ్ సంతోషంగా ఉండాలి.

హ్యాపీ బర్త్‌డే బేబీ.. దేవుడు నీకు సకల సంతోషాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.. వంద సంవత్సరాలు సంతోషంగా జీవించు.. నన్ను కూడా ఆనందంగా ఉంచు.

నువ్ నాకు ఎంత ముఖ్యమో నేను చెప్పను, కానీ నా కళ్ళలోకి చూస్తే నీకు తెలుస్తుంది, నీలాంటి భాగస్వామిని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు మై లవ్..

నువ్వు నాకు ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తివి.. Happy Birthday Day To You

నాకు నిన్ను ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు, నా శ్వాస వరకు నీతో ఉంటా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రేమకు అర్థం చెప్పిన నీకు.. జీవితంలో నాకు తోడుగా నిలిచిన నీకు.. నా బాధలో కన్నీళ్లు తుడిచిన నీకు.. ఓటమిలో నన్ను పైకి లేపేందుకు భుజం తట్టిన నీకు జన్మదిన శుభాకాంక్షలు

నీ చిరునవ్వును చూడగానే అన్ని టెన్షన్‌లను మరచిపోతా.. నువ్ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీరు భర్తగా, తండ్రిగా అద్భుతమైన వ్యక్తి.. Happy Birthday My Love

నీ వల్లే ఈ ఇల్లు చాలా బాగుంది, నా జీవితంలోని మహాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు

నీతో నా ప్రేమ ఎప్పటికీ.. ఇంకా ఎన్నాళ్లు అయినా నేను నీతో ఇలానే ఉంటా.. నువ్ లేని జీవితం నాకు వద్దు.. పుట్టినరోజు శుభాకాంక్షలు

మనం మన ప్రియమైనవారి కోసం ఇలాంటి ప్రత్యేక రాతలతో చెప్పాలి. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక బహుమతులు ఇవ్వాలి. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. అన్ని సందర్భాల్లోనూ వాళ్లని పొగడలేం. ఐ లవ్ యూ అంటాం కానీ బర్త్ డేలు, వెడ్డింగ్ యానివర్సరీల వంటి ప్రత్యేక సందర్భాల్లో కేవలం విష్ చేయడమే కాకుండా కొన్ని మాటలు చెప్పాలి. చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీరు ఇచ్చే బహుమతుల కంటే ఇటువంటి సందేశాలు చాలా ప్రత్యేకమైనవి. మీ ప్రియమైనవారికి హ్యాపీ బర్త్ డే అని పైన చెప్పిన విధంగా తెలపండి.

తదుపరి వ్యాసం