Birthday gift: కుమారుడి 18 వ పుట్టినరోజున గిఫ్ట్ గా రూ. 5 కోట్ల ఖరీదైన కారు
Birthday gift: యూఏఈలోని భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడికి 18వ పుట్టినరోజు సందర్భంగా 5 కోట్ల రూపాయల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Lamborghini Huracan STO: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుష్ కి బర్త్ డే గిఫ్ట్ గా రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ (Lamborghini Huracan STO) ను కార్ ను ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
తరుష్ ఇన్ స్టా పోస్ట్..
తన తండ్రి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ గురించి ఒక వీడియోలో తరుష్ తన ఇన్ స్టా పోస్ట్ లో వెల్లడించారు. ‘‘నా డ్రీమ్ కారు (Lamborghini Huracan STO) బహుమతితో నా 18వ పుట్టినరోజును మ్యాజికల్ గా మార్చినందుకు నా అద్భుతమైన తండ్రి వివేక్ కుమార్ రుంగ్తాకు అపారమైన ప్రేమ, కృతజ్ఞతలు. మీ ప్రేమ, సపోర్ట్ నాకు అన్నీ ముఖ్యం’’ అని ఆ ఇన్ స్టా పోస్ట్ లో తరుష్ రాశాడు. తరుష్ పోస్ట్ చేసిన ఇన్ స్టా వీడియోలో రుంగ్తా తన కుమారుడితో కలిసి లంబోర్ఘిని (Lamborghini) డీలర్ షిప్ లోకి ప్రవేశించాడు. వీడియో ముందుకు సాగే కొద్దీ పసుపు రంగు లగ్జరీ కారును వారు ఆవిష్కరించారు. చివర్లో తరుష్ తన తండ్రిని సంతోషంతో కౌగిలించుకుంటాడు. ఈ వీడియోను గత నెలలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి, ఈ క్లిప్ 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది.
లంబోర్ఘినీ అఫీషియల్ వీడియోలో కూడా..
ఈ తండ్రీకొడుకుల వీడియోను లంబోర్ఘినీ అబుదాబి అండ్ దుబాయ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘మామూలు విషయాలకు వెలుపల అసాధారణమైనవి ఉంటాయి. సాధించడాన్ని పునర్నిర్వచించిన లంబోర్ఘిని ఎస్.టి.ఒ కి సొంతం చేసకున్నందుకు అభినందనలు. దాన్ని సొంతం చేసుకోవడానికి ధైర్యం చేసే కళాకారుడికి ఆత్మీయ స్వాగతం’’ అని వారు రాసుకొచ్చారు.
ఈ వీడియోపై ప్రజలు ఎలా స్పందించారు?
ఈ పోస్టుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. ఒక వ్యక్తి ఇలా రాశాడు, “అద్భుతమైన రైడ్. కంగ్రాట్స్!”. మరొకరు "కంగ్రాట్స్ బ్రదర్, మీరు అద్భుతమైన రైడ్ చేశారు" అని పేర్కొన్నారు. కొందరు హార్ట్ ఎమోటికాన్స్ తో స్పందిస్తే, మరికొందరు వైరల్ వీడియోకు స్పందిస్తూ ఫైర్ ఎమోజీలను ఎంచుకున్నారు.