Sri Ram Navami Wishes : శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. ఇలాంటి పదాలతో చెప్పండి-happy ram navami 2024 greetings facebook messages whatsapp status quotes sri rama navami wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sri Ram Navami Wishes : శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. ఇలాంటి పదాలతో చెప్పండి

Sri Ram Navami Wishes : శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. ఇలాంటి పదాలతో చెప్పండి

Anand Sai HT Telugu
Apr 17, 2024 08:04 AM IST

Sri Rama Navami Greetings In Telugu : ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. జీవితంలో ఎలా ఉండాలో రాముడి కథ వివరిస్తుంది. రామ నవమి పండుగ సందర్భంగా మీ సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పండి. శ్రీరామ నవమి విషెస్ కింది విధంగా తెలపండి.

శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి ఏప్రిల్ 17న వచ్చింది. రామ నవమి అనేది రాముడి జన్మదినాన్ని జరుపుకొనే హిందూ పండుగ. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామ నవమి జరుపుకొంటారు. రామనవమి సందర్భంగా చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. శ్రీరామ భక్తులు చైత్రమాసం శుక్ల పక్ష పాడ్యం నుండి నవమి వరకు రామాయణం పారాయణం చేస్తారు, నవమి రోజున రామపట్టాభిషేకం పారాయణం చేయడం ద్వారా ఉత్సవాలను ముగిస్తారు. ఇలా 9 రోజుల పాటు ఉత్సవం జరగనుంది. రామ నామాన్ని జపిస్తే రాముడు మనలను రక్షిస్తాడనే అచంచల విశ్వాసం భక్తులకు ఉంది. కష్టాలను అధిగమించే శక్తి శ్రీరామ నామస్మరణతో లభిస్తుంది. ఈ రామ నవమి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలపండి. కొన్ని ఇక్కడ ఉన్నాయి.

yearly horoscope entry point

మీకు, మీ కుటుంబ సభ్యులకు రామ నవమి శుభాకాంక్షలు

'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే' Happy Rama Navami 2024

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముని దీవెనలు మీ కుటుంబ సభ్యులపై ఉండుగాక, ఆ భగవంతుడు మీ కలలను నెరవేర్చు గాక, జై శ్రీరామ్.. రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు మీ జీవితాన్ని శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతితో దీవించుగాక.. Happy Rama Navami

రామ నవమి.. భక్తజన జీవితాలలో సుఖ దుఃఖాలను పోగొట్టే రాముని జన్మదినం. శ్రీరాముడు మీ జీవితాన్ని కరుణించుగాక జై శ్రీ రామ్.. Happy Ram Navami 2024

కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో రాముడు చూపించాడు. రాముడి వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుంటే, ఎలాంటి కష్టాల నుండి బయటపడవచ్చు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో మెరిసిపోతుంది. మీకు హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

ప్రపంచమంతా సంతోషం వెల్లివిరియాలని, భారతదేశం యావత్ ప్రపంచానికి రోల్ మోడల్‌గా వెలుగొందాలని శ్రీరాముడిని ప్రార్థిద్దాం.. రామనవమి శుభాకాంక్షలు.

ఈ రామ నవమి నాడు మన జీవితాల్లో ఐక్యత, సౌభ్రాతృత్వం, ధైర్యసాహసాలు పాటించి హింసను నివారించుకుందాం.. Happy Sri Rama Navami

శ్రీరామ నవమి నాడు సకల శుభాలు కలగాలని రాముడిని ప్రార్థిద్దాం. జై శ్రీ రామ్

శ్రీరామ నవమి రోజున రాముడు తన ఆశీస్సులు మీకు ప్రసాదించుగాక. రామ జపం చేద్దాం, పవిత్ర మంత్రాలను పఠిద్దాం.. జై రామ్ జై జై రామ్.. రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముని దివ్య కృప మీకు ఎల్లప్పుడు ఉండుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులకు రామ నవమి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన రామ నవమి మీ జీవితంలో ఆశ, సానుకూలత, శాంతిని తీసుకురావాలి. రామ నవమి శుభాకాంక్షలు *రామ

ఈ రామ నవమి ఉత్సవం స్ఫూర్తితో నిండి ఉండాలని, రాముడు మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. Happy Sri Rama Navami 2024

Whats_app_banner