తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Treatments For Dandruff । చుండ్రును నివారించే ప్రభావవంతమైన సహజ మార్గాలు ఇవిగో!

Treatments for Dandruff । చుండ్రును నివారించే ప్రభావవంతమైన సహజ మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

04 April 2023, 17:13 IST

google News
    • Home Treatments for Dandruff: ఇంటి వద్దనే సులభమైన మార్గాల ద్వారా సహజంగా చుండ్రును నివారించగలిగే కొన్ని మార్గాలను ఇక్కడ చూడండి.
Home Treatments for Dandruff
Home Treatments for Dandruff (Unsplash)

Home Treatments for Dandruff

చుండ్రు అనేది ఒక తల మీద తలెత్తే ఒక సాధారణ సమస్య, ఇది తలపై చర్మం నుండి మృతకణాలు తొలగిపోవడం కారణంగా అది పొరలు పొరలుగా పొట్టు రూపంలో విడిపోతుంది. ఇదేమి అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ, తలలో చికాకును కలిగిస్తుంది. జుట్టు మీద, భుజాల మీద ఈ చుండ్రు రాలుతున్నప్పుడు నలుగురి మధ్యలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చుండ్రు విషయంలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అని. కానీ చుండ్రు అంటువ్యాధి కాదు. మీ నుంచి ఇతరులకు చుండ్రు వ్యాప్తికాదు, ఇతరుల చుండ్రు మీ తలపై అభివృద్ధి చెందదు.

తేలికపాటి చుండ్రును తేలికపాటి చుండ్రును సున్నితమైన రోజువారీ షాంపూతో తొలగించుకోవచ్చు. కానీ చుండ్రు ఎక్కువగా ఉంటే దానిని తొలగించుకోవడం కష్టం. యాంటీడాండ్రఫ్ షాంపూలు, ఔషధాలు ఎన్ని వాడినా ఫలితం ఉండకపోవచ్చు. అదృష్టవషాత్తూ చుండ్రును నివారించడానికి కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Home Treatments for Dandruff- చుండ్రును తొలగించేందుకు ఇంటి చికిత్సలు

ఇంటి వద్దనే సులభమైన మార్గాల ద్వారా సహజంగా చుండ్రును నివారించగలిగే కొన్ని మార్గాలను ఇక్కడ చూడండి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ ఒక సహజమైన యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ ఏజెంట్. ఇది చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నాశనం చేయడంలో సహాయపడుతుంది. మీ షాంపూలో కొన్ని చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలపండి, ఆపై మీ తలకు మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి.

కలబంద

కలబందలో సహజమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి, ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరాకు ఏదీ కలపాల్సిన అవసరం లేదు. అలోవెరా జెల్‌ను నేరుగా మీ తలకు అప్లై చేసి, కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోండి. ఈ విధానాన్ని వారానికి రెండుసార్లు పునరావృతం చేయండి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి, ఇది పొడి స్కాల్ప్‌, తలలో దురద నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది, చుండ్రును తగ్గించడంలోనూ ప్రభావం చూపుతుంది. మీ తలపై కొబ్బరి నూనెను సున్నితంగా మసాజ్ చేయండి కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకోండి, ఆపైన తలను తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ విధానాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు పునరావృతం చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్‌లో సహజమైన యాసిడ్‌లు ఉన్నాయి, ఇవి మీ స్కాల్ప్‌లోని పిహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి, ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌, నీటిని సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి, దానిని తలకు వర్తించండి. కొన్ని నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి.

వంట సోడా

బేకింగ్ సోడా అనేది సహజమైన ఎక్స్‌ఫోలియంట్, ఇది మీ స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది, చుండ్రును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌ను రూపొందించండి. దీనిని తలకు అప్లై చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకోవాలి, ఆ తర్వాత పూర్తిగా శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఈ విధానాన్ని పునరావృతం చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం