తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Ulli Karam: గోంగూర ఉల్లికారం కూర ఇలా చేయండి, రుచి అదిరిపోతుంది

Gongura Ulli karam: గోంగూర ఉల్లికారం కూర ఇలా చేయండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

20 December 2024, 17:30 IST

google News
    • గోంగూరతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ మేము స్పైసీగా గోంగూర ఉల్లికారం రెసిపీ ఇచ్చాము. దీని రుచి అదిరిపోతుంది.
గోంగూర ఉల్లికారం రెసిపీ
గోంగూర ఉల్లికారం రెసిపీ (Youtube)

గోంగూర ఉల్లికారం రెసిపీ

చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎప్పుడూ గోంగూర పచ్చడి తింటే ప్రత్యేకమైన రుచి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ మేము గోంగూర ఉల్లికారం రెసిపీ ఇచ్చాము. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇగురులాగా వచ్చే ఈ కూరను వండడం చాలా సులువు. గోంగూర ఉల్లికారం కమ్మగా ఎలా ఉండాలో తెలుసుకోండి.

గోంగూర ఉల్లికారం రెసిపీకి కావలసిన పదార్థాలు

గోంగూర ఆకులు - నాలుగు కట్టలు

ఆవాలు - ఒక స్పూను

కారం - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

ధనియాలు - ఒక స్పూన్

జీలకర్ర - ఒక స్పూన్

వెల్లుల్లి రెబ్బలు - పది

పచ్చి శనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

నూనె - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - రెండు

ఉల్లిపాయలు - నాలుగు

ఎండు మిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

గోంగూర ఉల్లికారం రెసిపీ

1. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, కారం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఈ మసాలా ముద్దను తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

6. అవి బాగా వేగాక రోట్లో దంచుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా బాగా కలుపుకోవాలి.

7. ఇది బాగా వేగే వరకు చిన్న మంటట మీద ఉడికించాలి.

8. ఆ తర్వాత గోంగూర ఆకులను ఏరి నీటితో కడిగి సన్నగా తరిగి ఉల్లిపాయల మిశ్రమంలో వేసుకోవాలి.

9. ఒకసారి కలిపి పైన మూత పెట్టి ఉడికించాలి.

10. పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.

11. ఇగురు కూర రెడీ అయిపోతుంది. దీన్ని బాగా ఉడికే వరకు చిన్న మంట మీద ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ గోంగూర ఉల్లికారం రెడీ అయినట్టే.

వేడి వేడి అన్నంలో ఈ గోంగూర ఉల్లికారం రెసిపీని ప్రయత్నించండి. నాకు కచ్చితంగా బాగా నచ్చుతుంది.

చలికాలంలో గోంగూర తినడం అత్యవసరం. దీనిలో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఇనుము వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. రేచీకటి వంటివి రాకుండా ఇది అడ్డుకుంటాయి. అలాగే దృష్టి సమస్యలు రాకుండా కూడా అడ్డుకుంటాయి. గోంగూరను ఆహారంలో భాగం చేసుకుని తినడం చాలా అవసరం. దీనిలో ఉండే పోషకాలు మన బరువు తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. తరచూ గోంగూర తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గుండెకి సంబంధిత వ్యాధులు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి గోంగూరకు ఉంది.

తదుపరి వ్యాసం