తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు.. సింపుల్‍గా చేసుకోవచ్చు.. ఎన్నో లాభాలు

Weight loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు.. సింపుల్‍గా చేసుకోవచ్చు.. ఎన్నో లాభాలు

13 November 2024, 8:30 IST

google News
    • Weight loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి అల్లం, లవంగాలతో చేసే టీ చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అయ్యే ప్రయత్నానికి చాలా మేలు చేస్తుంది. అలాగే, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ టీ ఎలా చేయాలో.. లాభాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Weight loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు.. సింపుల్‍గా చేసుకోవచ్చు.. ఎన్నో లాభాలు
Weight loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు.. సింపుల్‍గా చేసుకోవచ్చు.. ఎన్నో లాభాలు

Weight loss Tea: బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మేలు.. సింపుల్‍గా చేసుకోవచ్చు.. ఎన్నో లాభాలు

బరువు తగ్గాలనుకునే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెయిట్ లాస్‍కు ఉపయోగపడే, పోషకాలు ఉండే ఫుడ్స్ తినడం చాలా కీలకం. అలాగే, హెల్దీ డ్రింక్స్ కూడా తాగాలి. బరువు తగ్గడాన్ని వేగవంతం చేసేలా ఉండే టీలు తీసుకోవాలి. ఇలా వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారికి ‘అల్లం లవంగాల టీ’ ఎంతో ఉపయోగపడుతుంది. చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఓవరాల్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీ చేసుకునే విధానం, లాభాలను చూడండి.

‘అల్లం లవంగాల టీ’ చేసే విధానం

  • ముందుగా ఓ గిన్నెలో ఓ కప్ నీటిని కాస్త మరిగించుకోవాలి.
  • ఆ నీటిలో ఓ పొడవాటి అల్లం ముక్క, నాలుగు లవంగాలు చేసి బాగా మరిగించాలి.
  • ఐదు నిమిషాల పాటు నీటిలో అల్లం, లవంగాలను ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓ కప్‍లో వడగట్టుకోవాలి.
  • అలా తయారైన అల్లం లవంగాల టీలో టేస్ట్ కోసం ఓ టీస్పూన్ తేనెను వేసుకోవచ్చు. రోజులో రెండుసార్ల వరకు ఈ టీ తాగొచ్చు.

జీర్ణక్రియకు మేలు

జీర్ణక్రియను ఈ అల్లం లవంగాల టీ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఇది కీలకమైన విషయం. ఆహారాన్ని ఈ టీ సులువుగా జీర్ణం చేయగలదు. గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా తగ్గేందుకు సహకరిస్తుంది.

వ్యర్థాలు బయటికి పోయేలా..

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా బయటికి వెళ్లేలా ‘అల్లం లవంగాల టీ’ తోడ్పడుతుంది. శరీరం క్లీన్‍గా అయ్యేందుకు సహకరించి బరువు తగ్గేందుకు ఈ టీ ఉపయోగపడుతుంది. శరీరాన్ని యాక్టివ్‍గా కూడా ఉంచగలదు.

జీవక్రియను పెంచుతుంది

అల్లం లవంగాల టీ.. శరీరంలో జీవక్రియను అధికం చేయగలదు. అల్లం, లవంగాల్లో ఈ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల ఫ్యాట్ సులువుగా కరిగే అవకాశాలు పెరుగుతాయి. దీంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

ఆకలి తగ్గేలా..

అల్లం లవంగాల టీ తాగడం వల్ల తరచూ ఆకలి కాకుండా ఉంటుంది. సంతృప్తిగా అనిపించేలా చేయగలదు. చిటికీమాటికి ఆకలి వేసి తినడం వల్ల క్యాలరీలు తీసుకోవడం ఎక్కువవుతుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు కష్టం అవుతుంది. అయితే, ఆకలిని ఈ టీ తగ్గించలదు. దీంతో తక్కువ క్యాలరీలు తీసుకునేలా తోడ్పడుతుంది. ఇలా వెయిట్ లాస్ ప్రయత్నానికి సహకరిస్తుంది.

ఈ ప్రయోజనాలు కూడా..

అల్లం లవంగాల టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. ఛాతిలో, గొంతలో మంటను కూడా తగ్గించగలదు. నీటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది. వికారాన్ని తగ్గించగలదు. అందుకే ఈ అల్లం లవంగాల టీని ప్రతీ రోజు తాగితే ఓవరాల్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు కల్పిస్తుంది.

తదుపరి వ్యాసం