బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పాలకూర కంట్రోల్ చేయగలదా.. ఎలా?
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Jul 12, 2024
Hindustan Times Telugu
పాలకూరను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. అందులో ఫైబర్, ఫోలెట్, ఐరన్, కాల్షియమ్, మెగ్నిషియమ్ సహా చాలా విటమన్లు, పోషకాలు ఉంటాయి. పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు పాలకూర తోడ్పడుతుంది. ఇందులోని పోషకాలు ఇందుకు సహకరిస్తాయి. అదెలానో చూడండి.
Photo: Pexels
పాలకూరలో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇది శరీరంలో గ్లూజోజ్ లెవెల్స్‌ను స్థిరీకరించగలదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా పాలకూర సహకరిస్తుంది.
Photo: Pexels
పాలకూరలో కార్బొహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. పోషకాలను అందించడంతో పాటు సులువుగా జీర్ణమవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
పాలకూరలో గ్లిసెమిక్స్ ఇండెక్స్ అత్యల్పంగా ఉంటుంది. దీంతో గ్లూకోజ్ పెరుగుతుందనే భయం లేకుండా డయాబెటిస్ ఉన్న వారు దీన్ని తినొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం తక్కువగా ఉంటుంది.
Photo: Pexels
పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు ఇది కూడా కీలకంగా ఉంటుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి