తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Get Ready For Monsoon । వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. మీ రోగనిరోధక శక్తి పెంచుకోండిలా!

Get Ready for Monsoon । వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. మీ రోగనిరోధక శక్తి పెంచుకోండిలా!

HT Telugu Desk HT Telugu

22 June 2023, 7:45 IST

google News
    • Monsoon Health Tips: వర్షాకాలం వస్తూనే అనేక ఆనందాలను తెస్తుంది. అలాగే కొన్ని సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏమిటి? వేటిని తినాలి, వేటిని నివారించాలి? ఇక్కడ తెలుసుకోండి.
Get ready for monsoon
Get ready for monsoon (stock pik)

Get ready for monsoon

Monsoon Health Tips: మాన్‌‌సూన్ ఆగమనంతో తొలకరి జల్లులు చల్లని అనుభూతిని కలిగిస్తాయి, వర్షపు చుక్కలతో తడిసిన నేల కమ్మని మట్టి సువాసనతో సమ్మోహన పరుస్తుంది, చిటపట చినుకుల కురుస్తుండగా వేడివేడి పకోడీల రుచి అద్భుతం అనిపిస్తుంది. వర్షాకాలం వస్తూనే అనేక ఆనందాలను తెస్తుంది. అలాగే కొన్ని సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తుంది. వర్షాకాలంలో ఎవరైనా చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. వర్షాకాల వ్యాధులను స్థూలంగా మూడు వర్గాలుగా విభజించవచ్చు: దోమల ద్వారా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ వైరల్ వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఈ సీజన్‌లో ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట చేసే ఆహారాలను, స్ట్రీట్ ఫుడ్ నివారించడం మేలు.

కలరా, అతిసార వ్యాధులను నివారించడానికి వర్షాకాలంలో కాచిన నీటిని తీసుకోవడం, సరిగ్గా ఉడికించని లేదా మూతపెట్టని ఆహారాన్ని నివారించడం మంచిది. తరచుగా చేతి పరిశుభ్రతను పాటించడం కూడా తప్పనిసరి.

ఈ సీజన్‌లో మీరు ఆరోగ్యంగా ఉండటానికి శుభ్రమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏమిటి? వేటిని తినాలి, వేటిని నివారించాలి? ఇక్కడ తెలుసుకోండి.

1. యాపిల్స్, జామూన్స్, లిచీ, ప్లమ్స్, చెర్రీస్, పీచెస్, బొప్పాయిలు, బేరి, దానిమ్మ వంటి పండ్లు తినాలి. పుచ్చకాయ, సీతాఫలాన్ని నివారించండి.

2. మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోండి.

3. పాలకు బదులు పెరుగు, ఇతర ప్రోబయోటిక్స్ తీసుకోండి, చెడు బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం తగ్గుతుంది.

4. మెంతులు, కాకరకాయ, వేప, పసుపు వంటి మూలికలు, సుగంధ ద్రవ్యాలు అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

5. పచ్చివి తినడం, సలాడ్‌లను తినడం మానుకోండి. తినడానికి ముందు ఆవిరిలో ఉడికించాలి.

6. వర్షాకాలంలో నువ్వులు, వేరుశనగ, ఆవ నూనెలను నివారించండి. ఇవి ఇన్ఫెక్షన్లను ఆహ్వానిస్తాయి, కాబట్టి మొక్కజొన్న నూనె లేదా ఏదైనా తేలికపాటి నూనెను తీసుకోండి.

7. రెండు నెలల పాటు మాంసానికి దూరంగా ఉండండి లేదా పరిమితం చేయండి. అనివార్యమైతే సూప్‌ల రూపంలో తీసుకోండి.

8. వర్షాకాలంలో అంటువ్యాధులు, జ్వరంతో బాధపడేవారు అల్లం, తులసి, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు వంటి ఔషధ మసాలా దినుసులతో తయారుచేసిన డికాక్షన్‌ను తాగాలి, దీనితో ఉపశమనం పొందవచ్చు.

9. కట్ చేసిన పండ్లు, వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ లేదా వీధి ఆహారాన్ని పూర్తిగా నివారించాలి.

10. మీరు అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, స్పైసి ఫుడ్‌ను నివారించండి, ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది వేగంగా వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది.

తదుపరి వ్యాసం