తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Health । సహజమైన రీతిలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!

Eye Health । సహజమైన రీతిలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

31 January 2023, 13:53 IST

google News
    • Ayurveda Remedies for Eye Health: కంటి చూపును మెరుగుపరిచి, దృష్టి లోపాలను నయం చేసి, మీ కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Ayurveda Remedies for Eye Health
Ayurveda Remedies for Eye Health (Unsplash)

Ayurveda Remedies for Eye Health

గ్లాకోమా అనేది కంటి నరాలు ఒత్తిడికి గురవడం వలన కలిగే దృష్టి లోపానికి సంబంధించిన సమస్య. ఇది మీ మెదడుకు, కళ్ల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తుంది. ఇది తీవ్రమైనపుడు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సాధారణ కంటి ఒత్తిడితో కూడా ఈ గ్లాకోమా సమస్య రావచ్చు. కాబట్టి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఈ రోజుల్లో ప్రజలకు దృష్టి సమస్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. కంటికి హాని కలిగించే అలవాట్లు, పోషకాహార లోపం, ఇతరత్రా కారణాల వలన ప్రజలు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే గ్లాకోమా వంటి తీవ్రమైన కంటి సమస్యలతో పాటు కంటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ సమస్యకు పురాతన వైద్యశాస్త్రం అయినటువంటి ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయుర్వేద కంటి స్పెషలిస్ట్ డాక్టర్ మహేందర్ సింగ్ బసు, డాక్టర్ యోగిని పాటిల్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ ఆయుర్వేద చిట్కాలను పంచుకున్నారు. కళ్లలోని టాక్సిన్స్ తొలగించేందుకు, ప్రతిరోజూ ఉదయం పూట చల్లటి నీటితో మీ కళ్ళను మెల్లగా కడగాలి. సహజసిద్ధంగా లభించే రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు, ఇది శీతలీకరణ ప్రభావాలను కలిగి ఉంటుంది. అదనంగా, ఔషధ గుణాలు కలిగిన నెయ్యిని కూడా కళ్ళకు పూయవచ్చునని తెలిపారు. ఇలా చేయడం వల్ల మీ కళ్లలోని మలినాలు తొలగిపోతాయని డాక్టర్ మహేందర్ అన్నారు.

ఆయుర్వేద వైద్య నిపుణులు కంటి ఆరోగ్యానికి సంబంధించి అందించిన మరికొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ayurveda Remedies for Eye Health- కంటి ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

  • త్రతక కర్మ మెడిటేషన్ చేయడం ద్వారా దృష్టి మెరుగుపడుతుంది. ఈ రకమైన ధ్యానంలో చీకటి గదిలో కొవ్వొత్తి ముందు కూర్చొని ధ్యానం చేయడం లేదా ఒక బిందువును కొద్దిసేపు తదేకంగా చూడటం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇది మీ దృష్టిని మెరుగుపరుస్తుంది.
  • కంటి పాచెస్ చల్లబరచడానికి తాజా మేక పాలతో ముంచిన దోసకాయ కాటన్ ప్యాడ్‌లను ఉపయోగించవచ్చు. ఈ కాటన్ ప్యాడ్‌లను కళ్ళ పైన ఉంచినప్పుడు, ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, కళ్లను పూర్తిగా రిఫ్రెష్ చేస్తుంది.
  • ఉసిరి, భిబిటాకీ, హరితకీలను మిళితం చేసే శక్తివంతమైన మూలికల మిశ్రమం త్రిఫల. దీనిని కంటి చుక్కల ద్వారా లేదా నోటితో తీసుకోవడం చేయవచ్చు. ఇది కంటి ఒత్తిడి, ఎరుపు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్లాకోమాను నయం చేయడానికి గొప్ప ఔషధం.
  • ప్రతిరోజూ "ప్రతిమర్షనాస్య" (నాసికా కుహరం ద్వారా మందులను వర్తించే విధానం) వర్తింపజేయడం వలన షిరోస్ట్రోటాస్ శుభ్రపడుతుంది, తద్వారా కంటి వ్యాధులను నివారిస్తుంది.
  • "పాదాభ్యంగ" లేదా మూలికా నూనెలతో పాద మసాజ్ మంచి దృష్టి, కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
  • కంటి వ్యాధులను నివారించడానికి "నేత్రఅంజన్" ని ఉపయోగించడం ఉత్తమ నేత్ర ఔషధం.
  • క్యారెట్, ఆకు కూరలు వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం కూడా ఆరోగ్యవంతమైన కళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
  • శీర్షాసన, త్రతక వంటి యోగాసనాలు సాధన చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది.
  • ప్రతిరోజు 6-8 గంటల నిరాటంకమైన రాత్రి నిద్ర మంచి కంటి ఆరోగ్యానికి కీలకం.

గమనిక: కళ్లు చాలా సున్నితమైనవి. మీరు కంటికి సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలన్నా ముందుగా సరైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇక్కడ పేర్కొన్న ఆయుర్వేద చిట్కాలను అనుసరించే ముందు, మీకు దగ్గరలోని ఆయుర్వేద అభ్యాసకుడిని సంప్రదించి వారి సలహా తీసుకోవడం మరిచిపోకండి.

టాపిక్

తదుపరి వ్యాసం