తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  French Toast: ఫ్రెంచ్ టోస్ట్, పిల్లలకు నచ్చే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్, అందరికీ నచ్చడం ఖాయం

French Toast: ఫ్రెంచ్ టోస్ట్, పిల్లలకు నచ్చే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్, అందరికీ నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu

02 July 2024, 6:00 IST

google News
    • French Toast: ఫ్రెంచ్ టోస్ట్ టేస్టీగా ఉంటుంది. గుడ్లతో చేసే ఈ బ్రేక్‌ఫాస్ట్ పిల్లలకు చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.
ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ
ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ

ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ

French Toast: పిల్లలకు ఒకసారి ఫ్రెంచ్ టోస్ట్ పెట్టారంటే వారు చాలా ఇష్టంగా తింటారు. ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఇడ్లీ, దోశ, ఉప్మా పెడితే వారు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి అప్పుడప్పుడు బ్రెడ్ త్ ఫ్రెంచ్ టోస్ట్ పెడితే వారు ఇష్టంగా తింటారు. దీన్ని కేవలం పది నిమిషాల్లో వండేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి రెసిపీ తెలుసుకోండి.

ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గుడ్లు - రెండు

బ్రెడ్ - ఆరు స్లైసులు

పాలు - పావు కప్పు

పంచదార - ఒకటిన్నర స్పూను

దాల్చిన చెక్క పొడి - చిటికెడు

బటర్ - రెండు స్పూన్లు

ఉప్పు - చిటికెడు

ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ

1. స్టవ్ పాన్ పెట్టి ఒక స్పూను బటర్ వేసి బ్రెడ్ స్లైసులను రెండు వైపులా కాల్చుకోవాలి.

2. ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టి బాగా గిలక్కొట్టాలి. అందులో పాలు, పంచదార, దాల్చిన చెక్క పొడి, ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.

3. స్టవ్ మీద పాన్ పెట్టి బటర్ వేయాలి. ఈలోపు కాల్చిన బ్రెడ్ స్లైసులను గిలక్కొట్టిన కోడిగుడ్ల మిశ్రమంలో వేయాలి.

4. వేడెక్కిన పాన్ మీద ఆ బ్రెడ్ స్లైసులు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

5. వాటిని తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి.

6. పిల్లలు ఈ ఫ్రెంచ్ టోస్ట్ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తిన్నారంటే వాళ్లు మళ్లీ మళ్లీ తినాలని అడుగుతారు.

ఈ ఫ్రెంచ్ టోస్ట్ చేయడం చాలా సులువు. దీన్ని చేయడానికి కేవలం పదినిమిషాలు చాలా సులువు. ఈ ఫ్రెంచ్ టోస్ట్ ను తేనెతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మాపుల్ సిరప్ తో తిన్నా రుచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం