Potato Bread Sandwich: పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్, పిల్లలకు నచ్చే టేస్టీ బ్రేక్ ఫాస్ట్-potato bread sandwich recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Bread Sandwich: పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్, పిల్లలకు నచ్చే టేస్టీ బ్రేక్ ఫాస్ట్

Potato Bread Sandwich: పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్, పిల్లలకు నచ్చే టేస్టీ బ్రేక్ ఫాస్ట్

Haritha Chappa HT Telugu
Jun 23, 2024 06:00 AM IST

Potato Bread Sandwich: బంగాళాదుంపలతో చేసే ఆహారాలను పిల్లలు ఇష్టంగా తింటారు. వారికి బ్రేక్ ఫాస్ట్‌లో ఒకసారి పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ పెట్టి చూడండి. అది వారికి కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

పొటాటో బ్రెడ్ సాండ్‌ విచ్
పొటాటో బ్రెడ్ సాండ్‌ విచ్

Potato Bread Sandwich: ఈమధ్య పిల్లలు సాండ్‌విచ్‌లను ఇష్టపడుతున్నారు. వీరికి ఇంట్లోనే పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ చేసి పెట్టండి. ఇది బ్రేక్ ఫాస్ట్ రెసిపీ చేయడం చాలా సులువు. తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది. బ్రెడ్‌లను టోస్టర్‌లో కాల్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. లేదా గ్రిల్ చేసినా, పెనం మీద కాల్చుకున్నా చాలు. వాటితో పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ రెసిపీ‌కి కావలసిన పదార్థాలు

బ్రెడ్ ముక్కలు - నాలుగు

నూనె - ఒక స్పూను

చీజ్ తురుము - మూడు స్పూన్లు

బటర్ - రెండు స్పూన్లు

ఉడకబెట్టిన బంగాళదుంపలు - రెండు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

పచ్చి బఠానీలు - పావు కప్పు

కొత్తిమీర తరుగు - పావు కప్పు

కారంపొడి - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - పావు స్పూను

పసుపు పొడి - చిటికెడు

చాట్ పొడి - పావు స్పూను

పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ రెసిపీ

1. బ్రెడ్లను ముందుగానే పెనం మీద లేదా టోస్టర్లో కాల్చి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకొని చేత్తోనే మెత్తగా గుజ్జులా మెదుపుకోవాలి.

3. ఒక గిన్నెలో ఆ బంగాళదుంప గుజ్జును వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు స్పూన్లు వేయాలి.

4. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చి బఠానీలను కూడా వేయాలి.

5. అలాగే కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, చాట్ మసాలా వేసి బాగా కలపాలి.

6. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

7.ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసి చేత్తోనే బ్రెడ్ మొత్తం అద్దుకోవాలి.

8. కాస్త మందంగా వేసుకోవాలి. పైన తురిమిన చీజ్ ను వేసి దానిపై మరొక బ్రెడ్ స్లైస్ ను పెట్టి గట్టిగా అదమాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ బ్రెడ్ స్లైసులు పెట్టి పెట్టి రెండు వైపులా చిన్న మంట మీద కాల్చుకోండి.

10. రెండువైపులా అలా కాల్చుకున్నాక సర్వ్ చేయండి. అంతే టేస్టీ పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ రెడీ అయినట్టే.

11. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. పిల్లలకు ఇది నచ్చడం ఖాయం.

ఎప్పుడూ ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా లాంటి టిఫిన్లను పెడితే పిల్లలకు ఇష్టం ఉండదు. వారికి అప్పుడప్పుడు ఇలా పొటాటో బ్లడ్ సాండ్ విచ్ వంటివి పెట్టి చూడండి. ఇవి మీకు నచ్చడం ఖాయం. వీటిని తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. బంగాళదుంపలను ఉడకబెట్టడానికే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అవి ఉడికిపోతే ఆ తర్వాత ఈ పొటాటో బ్రెడ్ సాండ్‌విచ్ చేయడానికి 10 నిమిషాలు సరిపోతుంది.

Whats_app_banner