తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Health Tips : సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి

Summer Health Tips : సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి

HT Telugu Desk HT Telugu

25 February 2023, 11:33 IST

google News
    • Summer Health Tips : చలికాలంలో దుప్పటి శరీరం నిండా కప్పుకొని పడుకున్నారు. ఇక సమ్మర్ వచ్చింది. ఫిబ్రవరిలోనే ఎండ విపరీతంగా కొడుతుంది. వేసవి కాలం ఆరంభమైంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
సమ్మర్ హెల్త్ టిప్స్
సమ్మర్ హెల్త్ టిప్స్

సమ్మర్ హెల్త్ టిప్స్

కొన్ని రోజులుగా వాతావరణం(Weather)లో మార్పులు వచ్చాయి. పగలు వేడి విపరీతంగా ఉంటుంది. అయితే అర్ధరాత్రి దాటాక కాస్త చల్లగా ఉంటుంది. ఇప్పటికే వేసవి కాలం ఆరంభమైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సీజన్(Season)కు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

సమ్మర్(Summer) అనగానే.. పానీయాలను ఎక్కువగా తాగుతారు. అయితే అవి తీసుకునేముందు జాగ్రత్తలు వహించాలి. పగలు వేడి ఉందని.. చల్లని నీటిని తాగుతారు. దీనితో రాత్రి వరకూ జలుబు చేసే అవకాశం ఉంటుంది. అయితే గది ఉష్ణోగ్రత(temperature) వద్ద ఉండే నీటిని తాగాలి. దీనితో జలుబు, ముక్కు దిబ్బడ రాకుండా ఉంటాయి. త‌క్కువ క్యాల‌రీలు ఇచ్చే ఆహారాన్ని(Food) తీసుకోవాలి. వేపుళ్లు, కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను మానేయాలి. లేదంటే.. త‌క్కువ‌గా తినాలి. జీర్ణ సమస్యలు వస్తాయి.

కొంతమందికి ఎండకాలంలో జలుబు చేస్తుంది. అది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం జలుబు(Cold), దగ్గు రాకుండా ఉంటాయి. విట‌మిన్ ఎ, సి ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం ఒక్కటే ఉత్తమ మార్గం. మీ ఆహారంలో పోషకమైన ఆహారాల‌ను చేర్చాలి. రాత్రిపూట‌ తేలికగా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి. సలాడ్లు, రసాలు, సూప్, స్మూతీస్ తీసుకోవ‌చ్చు. చెమట(Sweat)తో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. శరీరంలో నీటి కొరత వస్తుంది. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగండి. నీటిని ఎక్కువగా తాగితే.. శరీరం(Body) హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలో ద్రవాలు తగ్గకుండా ఉంటాయి. నీరు, నిమ్మకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. సన్ స్క్రీన్(Sun Screen) లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడూ లేత రంగు దుస్తులను వేసుకోవాలి. వేసవిలో పాదాలను కూడా రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో వేప ఆకులు వేసి కొద్ది సేపు.. అయిన తర్వాత ఆ నీటితో స్నానం చేయోచ్చు.

తదుపరి వ్యాసం