Pepper Lemon Tea Recipe : కీళ్ల నొప్పులను తగ్గించి.. రోగ నిరోధక శక్తిని పెంచే పానీయం..
Pepper Lemon Tea Recipe : చలికాలంలో కీళ్ల నొప్పులు రావడం సహజం. అలాగే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఉదయాన్నే మీరు తాగే డ్రింక్ ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తుంది అంటే మీరు కచ్చితంగా దానిని తీసుకుంటారు. అదే పెప్పర్ లెమన్ టీ.
పెప్పర్ లెమన్ టీ
Pepper Lemon Tea Recipe : పెప్పర్ లెమన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయం చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని హాయిగా సేవించవచ్చు. ఇంతకీ దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* నిమ్మకాయ రసం - 1
* పసుపు పొడి - 1/2 స్పూన్
* పెప్పర్ - 1/4 స్పూన్
* తేనె - 1 1/2 స్పూన్
తయారీ విధానం
ఓ కప్పులో మిరియాలు, పసుపు వేసి.. దానిలో వేడినీటిని పోయాలి. నిమ్మరసం, తేనె వేసి బాగా కలపండి. వేడిగా ఉన్నప్పుడే తాగేయండి. ఇది చల్లని వాతావరణంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సంబంధిత కథనం