తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care Tips : మోనోపాజ్ దశలు మహిళలు చర్మాన్ని ఇలా కాపాడుకోవాలి.. లేదంటే మీ లుక్ మారిపోతుంది..

Skin Care Tips : మోనోపాజ్ దశలు మహిళలు చర్మాన్ని ఇలా కాపాడుకోవాలి.. లేదంటే మీ లుక్ మారిపోతుంది..

26 January 2023, 10:14 IST

google News
    • Menopause Skin Care Tips : మోనోపాజ్ దశలో ఆడవారిలో కలిగే మార్పులు చర్మంపై ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో చర్మం పొడిగా, నిర్జలీకరణంగా మారిపోతూ ఉంటుంది. మరి ఈ దశలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చర్మ సంరక్షణకై వేటిని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
స్కిన్ కేర్ టిప్స్
స్కిన్ కేర్ టిప్స్

స్కిన్ కేర్ టిప్స్

Menopause Skin Care Tips : సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య సంభవించే రుతువిరతి స్త్రీ పునరుత్పత్తి హార్మోన్లలో సహజ క్షీణతకు దారితీస్తుంది. అది వారి ఋతు చక్రం ముగింపును సూచిస్తుంది. ఈ రుతువిరతి వల్ల చర్మం పొడిబారడం, ఓపెన్ పోర్స్, మొటిమలు, నిర్జలీకరణంతో సహా చాలా దుష్ప్రభావాలతో వస్తాయి.

ఈ సమయంలో మీ చర్మ జీవక్రియ కూడా మందగిస్తుంది. అయితే రుతువిరతి సమయంలో మీ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో.. ఎలాంటి జాగ్రత్తలతో చర్మాన్ని కాపాడుకోవచ్చో.. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మాన్ని హైడ్రేట్​గా ఉంచుకోండి

రుతువిరతి సమయంలో, తరువాత మీ చర్మం తేమను కలిగి ఉండదు. ఈస్ట్రోజెన్ స్థాయిలు గణనీయంగా పడిపోవడం వల్ల స్కిన్ పొడిగా, దురదగా, సున్నితంగా మారుతుంది.

మీ చర్మం ఉపరితలం నుంచి అదనపు నీటి నష్టాన్ని నివారించడానికి, దానిని దృఢంగా, పోషణగా చేయడానికి, క్రమం తప్పకుండా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. మీరు రాడికల్ డ్యామేజ్‌ను నివారించడానికి, వాపు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి విటమిన్ సి సీరమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

రెటినోల్ ఉపయోగించడం మర్చిపోకండి..

మెనోపాజ్ సమయంలో ఏర్పడే ఫైన్ లైన్స్, గీతలు, ముడతలు వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి రెటినోల్ సరైన పరిష్కారం. రెటినోల్ వృద్ధాప్య కణాల ప్రవర్తనను మార్చడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి చర్మాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మీకు యవ్వనంగా, మృదువుగా, మెరిసే చర్మం అందుతుంది.

మీ చర్మం పొడి, సున్నితత్వాన్ని తొలగించడానికి మీరు రెటినోల్ ఆధారిత నైట్ క్రీమ్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు.

ఫేస్ మిస్ట్​ ఉపయోగించండి

హాట్ ఫ్లాషెస్ అనేది మెనోపాజ్ సాధారణ దుష్ప్రభావం. ఇది ఎగువ శరీరంలో.. ముఖ్యంగా ఛాతీ, ముఖం, మెడపై వెచ్చదనానికి దారితీస్తుంది. దానివల్ల చర్మం ఎరుపుగా మారడం, చెమటను కూడా కలిగిస్తుంది.

ఈ హాట్ ఫ్లాషెస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి.. లావెండర్, కలబంద లేదా చమోమిలే సువాసనలతో కూడా ఫేస్ మిస్ట్​ ఉపయోగించవచ్చు. ఇది మిమ్మల్ని రిలాక్స్‌గా మార్చి.. చల్లదనాన్ని ఇస్తుంది.

కంటి క్రీమ్ ఉపయోగించండి

రుతువిరతి సమయంలో.. మీ చర్మం సన్నబడటం, కంటి కింద క్యారీ బ్యాగ్స్, ఉబ్బడం, నల్లటి వలయాలను అభివృద్ధి చేస్తాయి. వీటి వలన మీ కంటి ప్రాంతంలో వృద్ధాప్య సంకేతాలు బాగా కనిపిస్తాయి.

మీరు మీ కంటి కింద ఉన్న ప్రాంతాన్ని హైడ్రేట్ చేయడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా, డీ-పఫ్ చేయడానికి ఐ క్రీమ్‌ను ఎంచుకోవచ్చు. మీరు కంటి కింద ఉన్న ప్రాంతాన్ని శాంతపరచడానికి కెఫిన్, విటమిన్ సి, పెప్టైడ్, గ్లిజరిన్‌తో నిండిన కంటి క్రీమ్‌ను తీసుకోవచ్చు.

సన్​ స్క్రీన్ ఉపయోగించండి

రుతుక్రమం ఆగిపోయిన చర్మం సన్నగా మారడం వల్ల వయసు వల్ల కలిగే మచ్చలు, చర్మ క్యాన్సర్ వంటి చర్మ సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల హానికరమైన UV రేడియేషన్ నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి.. సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

మీరు కనీసం SPF 30తో హైడ్రేటింగ్, జిడ్డు లేని సన్‌స్క్రీన్‌ని తీసుకోవచ్చు. ఇంటి నుంచి బయలుదేరే ముందు.. ఏకాలంలోనైనా దీన్ని అప్లై చేయాలని గుర్తుంచుకోండి.

తదుపరి వ్యాసం