తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  House Cleaning Tips For Financial Benefits : ఆర్థికంగా కలిసి రావాలంటే.. ఇంట్లో ఆ మూలలు శుభ్రం చేయాల్సిందే

House Cleaning Tips for Financial Benefits : ఆర్థికంగా కలిసి రావాలంటే.. ఇంట్లో ఆ మూలలు శుభ్రం చేయాల్సిందే

18 October 2022, 16:21 IST

    • House Cleaning Tips for Financial Benefits : దీపావళి పండుగ చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈసారి పండుగ అక్టోబర్ 24వ తేదీన వస్తుంది. అయితే దీపాల పండుగకి శ్రేయస్సు, సంపదను ఆకర్షించడానికి మీరు ఇంటిలోని కొన్ని మూలలను శుభ్రం చేయాల్సి వస్తుంది. అలా చేస్తే మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఆ మూలాలు శుభ్రం చేస్తే.. లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది..
ఇంట్లో ఆ మూలాలు శుభ్రం చేస్తే.. లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది..

ఇంట్లో ఆ మూలాలు శుభ్రం చేస్తే.. లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది..

House Cleaning Tips for Financial Benefits : దీపావళి 2022 దగ్గరలోనే ఉంది. భారతదేశంలోనే ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో దీపాల పండుగ ఒకటి. ఈ సంవత్సరం అక్టోబర్ 24న ఈ పండుగ చేసుకోబోతున్నాం. అయితే హిందూమతంలో దీపావళికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండుగ రోజున లక్ష్మీ దేవి- గణేశుడిని ఇంట్లో పెట్టి పూజిస్తాము. ఇలా ఇంట్లో లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని భక్తులు భావిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

పండుగకు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. అయితే మీరు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను పొందాలనుకుంటే.. మీరు ఇంటిలోని కొన్ని ముఖ్యమైన మూలల కచ్చితంగా శుభ్రం చేయాలి అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిలో ఈశాన్య మూల

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈశాన్య కోణం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశ దేవతలకు చెందినదని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయాన్ని ఈశాన్యంలో నిర్మిస్తారు. ఈ కోణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని.. లేదంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని నమ్ముతారు. అందుకే ఇంటి ఈశాన్య మూలలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఇంటి వాస్తును మెరుగుపరుస్తుంది.

బ్రహ్మ స్థానం

ఇంటి మధ్య భాగం చాలా ముఖ్యమైనది. దానిని బ్రహ్మ స్థానం అంటారు. ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ స్థలం నుంచి అనవసరమైన వస్తువులను తీసివేయాలి. దానిని ఎల్లప్పుడూ పూర్తిగా శుభ్రం చేయాలి. ఈ ప్రదేశాలలో పగిలిన గాజుసామాను, విరిగిన మంచం లేదా మరే ఇతర వస్తువులను ఉంచకూడదు.

గుర్తుంచుకోవలసిన దిశలు

దీపావళి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటికి తూర్పున ఉన్న ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అదే సమయంలో, ఇంటి ఉత్తర దిశను శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం