తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Cleaning Tips : టీవీని శుభ్రం చేసేప్పుడు జాగ్రత్త.. లేదంటే స్క్రీన్ హ్యాండ్ ఇస్తుంది

Diwali Cleaning tips : టీవీని శుభ్రం చేసేప్పుడు జాగ్రత్త.. లేదంటే స్క్రీన్ హ్యాండ్ ఇస్తుంది

18 October 2022, 9:39 IST

google News
    • Diwali Cleaning tips : పండుగల సమయంలో ఇళ్లు శుభ్రం చేయడం ముఖ్యమైన పని. అయితే అన్ని శుభ్రం చేసినట్లే టీవిని క్లీన్ చేయకండి. మీరు దానిని సరైన విధానంలో క్లీన్ చేయకపోతే.. టీవీలకు దీర్ఘకాలిక నష్టాలు జరుగుతాయి. మరి టీవీలు ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
మీ టీవీని ఇలా శుభ్రం చేయండి..
మీ టీవీని ఇలా శుభ్రం చేయండి..

మీ టీవీని ఇలా శుభ్రం చేయండి..

Diwali Cleaning tips : దీపావళి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఇళ్లు, వస్తువులు, గృహోపకరణాలు క్లీన్ చేస్తూ ఉంటాము. అయితే ఫర్నిచర్, గృహోపకరణాలను త్వరగా శుభ్రం చేయడానికి.. తరచుగా తప్పుడు పద్ధతిని ఎంచుకుంటారు. ఈ ఎంపికలతో.. ఉత్పత్తులను నాశనం చేసుకుంటారు. అయితే మీ దీపావళి క్లీనింగ్‌లో మీకు సహాయం చేయడానికి.. ముఖ్యంగా మీ టీవీ స్క్రీన్‌ను శుభ్రపరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుభ్రం చేసేటప్పుడు టీవీని ఆఫ్ చేయండి

శుభ్రం చేసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు తగ్గించడానికి మీ టీవీని ఆఫ్‌లో ఉంచాలి. పైగా స్క్రీన్‌పై దుమ్ము, మచ్చలు ఏవైనా ఉంటే స్పష్టంగా చూడటానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.

స్క్రీన్‌పై ఎలాంటి ద్రవాన్ని స్ప్రే చేయవద్దు

టీవీ బాడీ లేదా స్క్రీన్‌పై ఏదైనా లిక్విడ్‌ని స్ప్రే చేయడం మానేయండి. ఎందుకంటే ఇది అంతర్గత భాగాలకు హాని కలిగించవచ్చు. మీరు మీ టీవీని నిర్దిష్ట ఉత్పత్తితో శుభ్రం చేయాలనుకుంటే.. ముందుగా దానిని శుభ్రపరిచే గుడ్డపై లిక్విడ్ స్ప్రే చేయాలి. మీ టీవీని శుభ్రపరిచేటప్పుడు మీరు ఆల్కహాల్, అసిటోన్ లేదా అమ్మోనియా ఉన్న క్లీనర్‌లను ఉపయోగించకూడదు.

మైక్రోఫైబర్ వస్త్రంతో..

చాలా స్క్రీన్‌లు గీతలు, ప్రెజర్ సెన్సిటివ్‌కు గురయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి టీవీ డిస్‌ప్లేను శుభ్రపరిచేటప్పుడు మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించడమే మంచిది. స్మడ్జ్‌లు, చేతివేళ్లతో స్క్రీన్‌కు హాని లేకుండా శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ అనుకూలంగా ఉంటుంది.

ఏదైనా ఒక దిశలోనే తుడవండి

మీరు మీ టీవీ స్క్రీన్‌ని నిలువుగా లేదా అడ్డంగా ఏదైనా ఒక దిశలో మాత్రమే తుడవాలి. ఈ రకమైన కదలిక మీరు స్క్రీన్‌పై స్పాట్ లేదా మార్క్‌ను వదలకుండా చూసుకుంటుంది. ఈ పద్ధతి చారలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

స్క్రీన్ పొడిగా ఉండాలి

మీరు మీ టీవీని శుభ్రం చేసిన తర్వాత తిరిగి ఆన్ చేయడానికి ముందు స్క్రీన్ పొడిగా ఉందో లేదో చూసుకోవాలి. తడి మచ్చలు తరచుగా టీవీ స్క్రీన్‌పై కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి.

తదుపరి వ్యాసం