Diwali stock picks for Samvat 2079 : హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపావళి స్టాక్ పిక్స్..
17 October 2022, 16:12 IST
- Diwali stock picks for Samvat 2079 : దీపావళి స్టాక్స్ టు బై లిస్ట్‌ను హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. ఆ వివరాలు..
Shutterstock
Diwali stock picks for Samvat 2079 : సంవత్ 2079లో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు కొనసాగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. అయితే.. ప్రస్తుతం ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చని పేర్కొంది. వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ సంవత్ 2079లో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధివైపు అడుగులు వేస్తే.. స్టాక్ మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక సంవత్ 2079లో భాగంగా.. దీపావళి స్టాక్ పిక్స్‌ను ప్రకటించింది హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్. వచ్చే దీపావళి వరకు కొనగోళ్లు చేయదగిన 10 స్టాక్స్‌ని వెల్లడించింది.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం..
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్:- టైర్ 1 నగరాల్లో విస్తరణ, ధరల పెంపుతో కంపెనీ ఏఆర్‌పీఓబీ పెరుగొచ్చు. స్పెషాలిటీస్‌లో మెడికల్ వాల్యూ టూరిజానికి ఆదరణ పెరగవచ్చు. ఈ స్టాక్ టార్గెట్ రూ. 278.
భారత్ డైనమిక్స్:- కొత్త ప్రాడక్టులను తయారు చేసేందుకు తన అనుభవాలను ఉపయోగించుకోవాలని బీడీఎల్ చూస్తోంది. ఫలితంగా సంస్థ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడొచ్చు. రెవెన్యూ బలంగా ఉంటుందని అనిపిస్తోంది. ఆర్డర్ బుక్ కూడా బాగానే ఉంది. ఇండీజినైజేషన్, అంతర్గాత సామర్థ్యం పెంపు వంటిపై సంస్థ దృష్టిసారిస్తోంది. స్టాక్ టార్గెట్:- రూ. 1,022.
Best stocks to buy : భారత్ ఎలక్ట్రానిక్స్:- బీఈఎల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉంది. ప్రాఫిటబులిటీ, రిటర్నులు, జీరో నెట్ డెట్, మంచి లిక్విడిటీ.. సంస్థ సొంతం. స్టాక్ టార్గెట్:- రూ. 123
బిర్లా కార్పొరేషన్:- ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీ అనేక చర్యలు చేపట్టింది. క్లింకర్ కెపాసిటీ పెరుగుతోంది, కోల్ ఎక్స్ట్రాక్షన్తో రెవెన్యూ, మార్జిన్లు పెరుగుతాయి. స్టాక్ టార్గెట్ రూ. 1,069
సిప్లా:- సిప్లాకు 1 ఇండియా నుంచి 45శాతం, అమెరికా నుంచి 20శాతం, దక్షిణాఫ్రికా, సబ్ సహారా ఆఫ్రికా- గ్లోబల్ ఆక్సెస్ నుంచి 17శాతం, ఆర్ఓడబ్ల్యూ నుంచి 13శాతం, ఏపీఐ సెగ్మెంట్ నుంచి 3శాతం రెవెన్యూ లభిస్తోంది. ఇంత డైవర్సిఫైడ్‌గా ఉండటం సంస్థకు కలిసివచ్చే విషయం. స్టాక్ టార్గెట్ రూ. 1,283.
Diwali stocks 2022 : దీపక ఫర్టిలైజర్స్:- ఉత్పత్తుల్లో మార్పులు, ఆపరేషనల్ మేనేజ్మెంట్లో వృద్ధి, డీ-బాటిల్నెకింగ్, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్పాన్షన్ సంస్థకు కలిసి వచ్చే విషయాలు. స్టాక్ ధర రూ. 1,058.
ఐసీఐసీఐ బ్యాంక్:- రీటైల్, ఎస్ఎంఈ విభాగంలో అభివృద్ధి కోసం.. సాంకేతికపై పెట్టుబడి, డిజిటల్ ఇనీషియేటివ్స్పై సంస్థ మరింత దృష్టి సారించింది. సబ్సిడరీలు ఈ సంస్థకు మంచి వాల్యూలు తెచ్చిపెడుతున్నాయి. స్టాక్ టార్గెట్ రూ. 999
Stocks to buy for Diwali 2022 : రైల్ వికాస్ నిగం:- కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉంది. డివిడెండ్ యీల్డ్ 5శాతంగా ఆకర్షణీయంగా ఉంది. రానున్న ఏళ్లల్లో సంస్థ ఇంకా వృద్ధిచెందే అవకాశం ఉంది. స్టాక్ టార్టెట్ రూ. 42.25
సన్ టీవీ:- సన్ టీవీ ప్రాఫిట్ మార్జిన్లు అత్యంత శక్తివంతంగా ఉంటున్నాయి. స్టాక్ టార్గెట్ రూ. 624
టీసీఐ ఎక్స్‌ప్రెస్:- ఎఫ్వై 22-24లో సేల్స్, ఎబిట్డా, ఏపీఏటీ వరుసగా 18శాతం, 25శాతం, 25శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. స్టాక్ టార్గెట్ రూ. 2,169.
(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
టాపిక్