తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itc Share Price : ఈ ఏడాదిలో 52శాతం పెరిగిన ఐటీసీ స్టాక్​.. ఇప్పుడు కొనొచ్చా?

ITC share price : ఈ ఏడాదిలో 52శాతం పెరిగిన ఐటీసీ స్టాక్​.. ఇప్పుడు కొనొచ్చా?

Sharath Chitturi HT Telugu

07 October 2022, 10:36 IST

google News
    • ITC share price : ఐటీసీ స్టాక్​.. ఈ ఏడాదిలో దాదాపు 52శాతం పెరిగింది. మరి ఇక్కడ బై చేయవచ్చా?
ఈ ఏడాదిలో 52శాతం పెరిగిన ఐటీసీ స్టాక్​.. ఇప్పుడు కొనొచ్చా?
ఈ ఏడాదిలో 52శాతం పెరిగిన ఐటీసీ స్టాక్​.. ఇప్పుడు కొనొచ్చా?

ఈ ఏడాదిలో 52శాతం పెరిగిన ఐటీసీ స్టాక్​.. ఇప్పుడు కొనొచ్చా?

ITC share price : ఈ ఏడాది.. స్టాక్​ మార్కెట్ల కదలికలతో సంబంధం లేకుండా.. విపరీతంగా పెరిగిన స్టాక్స్​లో ఎఫ్​ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఒకటి. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఐటీసీ షేరు ధర దాదాపు 53శాతం పెరిగింది. మరి ఇప్పుడు ఐటీసీ స్టాక్​ని కొనుగోలు చేయవచ్చా? లేదా పోర్ట్​ఫోలియోలో ఉన్న స్టాక్స్​కి మరిన్ని యాడ్​ చేసుకోవచ్చా? నిపుణుల మాటేంటి?

ఎందుకు పెరుగుతోంది?

ఐటీసీ షేరు ధర ప్రస్తుతం రూ. 334గా ఉంది. గురువారం రూ. 336.65 వద్ద స్థిరపడింది. ఐదు రోజుల్లో ఈ స్టాక్​ పెద్దగా పెరగలేదు. కానీ నెల రోజుల వ్యవధిలో ఐటీసీ స్టాక్​ 2.5శాతం, ఆరు నెలల వ్యవధిలో 30.15శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు ఐటీసీ షేరు ధర ఏకంగా 52.44శాతం వృద్ధిచెంది మదుపర్లను సంతోష పెట్టింది. ఈ ఏడాది సమయంలో నిఫ్టీ50 సూచీ దాదాపు 2శాతం పతనమైంది.

ITC share price target : ఇక బ్రోకరేజీ సంస్థలు ఐటీసీ వ్యాపారాలపై, షేరు ధరపై సానుకూలంగా ఉన్నాయి. ఈ త్రైమాసికం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి.

"సిగరెట్​ ఎబిట్​లో 19శాతం(ఇయర్​ ఆన్​ ఇయర్​)వృద్ధి , ఎఫ్​ఎంసీజీ సెగ్మెంట్​ రెవెన్యూ 12శాతం(ఇయర్​ ఆన్​ ఇయర్​) వృద్ధిని మేము ఐటీసీ నుంచి ఆశిస్తున్నాము. అప్పుడు 3ఏళ్ల సీఏజీఆర్​ 11.2శాతంగా ఉంటుంది," అని కొటాక్​ సెక్యూరిటీస్​ పేర్కొంది.

ఎఫ్​ఎంసీజీ ఎబిట్​ మార్జిన్​ 5.1శాతం వృద్ధిచెందుతుందని, హోటల్స్​ బిజినెస్​లో బలం పెరగడం ఇందుకు ఒక కారణం అని కొటాక్​ సెక్యూరిటీస్​ వివరించింది. ఫలితంగా టార్గెట్​ ప్రైజ్​ని రూ. 337గా ఉంచుంది.

ITC share price today : ఐటీసీ షేరు ధర పెరగడానికి.. ఆ సంస్థ వ్యాపారాల్లో బలం ఓ కారణం. కొవిడ్​ సంక్షోభం నుంచి కోలుకుని ఐటీసీ మెరుగ్గా రాణిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. సంస్థ యాజమాన్యం మంచి లాభాలను జెనరేట్​ చేస్తోంది!

ఇది రానున్న కాలంలో కూడా కొనసాగుతుందని పలు బ్రోకరేజీ, రిసెర్చ్​ సంస్థలు భావిస్తున్నాయి.

(గమనిక: ఇది కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి చేసే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​న సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం