Wrist Exercises : మణికట్టు బలంగా తయారయ్యేందుకు ఈ వ్యాయామాలు చేయండి
01 April 2024, 5:30 IST
- Wrist Exercises In Telugu : మణికట్టును బలోపేతం చేయడానికి సాధారణ వ్యాయామాలు ఉన్నాయి. ఈ వ్యాయామాలు మణికట్టు కండరాల కదలికకు చాలా అవసరం.
మణికట్టు వ్యాయామాలు
మణికట్టును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనిని బలంగా చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని వ్యాయామాలు చేయాలి. మణికట్టు వ్యాయామాలు కంప్యూటర్ వినియోగదారులకు ప్రత్యేకంగా సహాయపడతాయి. ముంజేతిని మన చేతికి కనెక్ట్ చేయడం మణికట్టు. మణికట్టు ఎల్లప్పుడూ బలంగా ఉండాలి. మీ మణికట్టు బలంగా ఉంటే సులభంగా మీ చేతులతో కఠినమైన పనులు చేయవచ్చు. కింద చెప్పుకోబోయే మణికట్టు వ్యాయామాలు ఎప్పుడైనా చేయవచ్చు. ఇది మణికట్టును బలోపేతం చేయగలదు.
వేళ్లను తెరవడం, మూయడం వ్యాయామం చేయడం చాలా సులభం. ముందుగా రెండు చేతులు ముందుకు చాచాలి. ఇప్పుడు చేతిని రిలాక్స్ చేసుకోవాలి. ఒక చేయి తీసుకుని మరో చేతి వేళ్లను వెనక్కు వంచాలి. తర్వాత మరో చేతిని కూడా అలానే వంచుకోవాలి. ఆ వేళ్లను మడిచి కాసేపు మూయండి. ఈ వ్యాయామం కనీసం 10 సార్లు చేయండి. ఈ వ్యాయామం చేతులకు బలం ఇస్తుంది. అదే సమయంలో వేళ్లకు తాజాదనాన్ని ఇస్తుంది. మణికట్టు బలపడుతుంది. కంప్యూటర్ ముందుకు ఎక్కువగా కూర్చునేవారికి ఇది చాలా రిలాక్స్ అనిపిస్తుంది.
మణికట్టు చుట్టడం వ్యాయామం బాగుంటుంది. మీరు మీ చేతిలో డంబెల్‌తో ఈ వ్యాయామం చేయవచ్చు. ముందుగా ఒక ప్రదేశంలో హాయిగా కూర్చుని, మీ మోచేతులను మీ కాళ్లపై ఉంచుకోవాలి. మీ అరచేతులు ఆకాశానికి అభిముఖంగా ఉన్నట్లుగా మీ తుంటిని 90 డిగ్రీల వద్ద ఉంచాలి. ఇప్పుడు డంబెల్ పట్టుకుని మణికట్టును పైకి వంచాలి. తర్వాత సాధారణ స్థితికి రావాలి. ఈ వ్యాయామం 10 సార్లు చేయండి. మీ మణికట్టు బలంగా అవుతుంది.
మోకాళ్లను మీద కూర్చొండి. ప్రార్థన చేస్తున్నట్లుగా ఉండాలి. అరచేతులను మీ మోకాళ్ల కింద పెట్టుకోవాలి. మీ వేళ్లను దగ్గరగా ఉంచండి. ఇలా చేస్తే మీ చేతులకు బలం పెరుగుతుంది. కానీ వేళ్లను తీసివేయవద్దు. ఇది అదే స్థితిలో కాసేపు చేయండి. మీ మణికట్టుకు కూడా ఉపయోగపడుతుంది.
మరో వ్యాయామం కోసం ముందుగా మోకాళ్ల మీద కూర్చోవాలి. మీ చేతులను ముందుకు పెట్టాలి. ముందు చేతులను గుండ్రంగా తిప్పుకోవాలి. అరచేతులు నేలకు ఎదురుగా ఉండాలి. మీ చేతులను గట్టిగా ఉంచండి. తర్వాత నెమ్మదిగా చేతులను తిప్పుతూ సాధారణ స్థితికి రావాలి. ఈ వ్యాయామం 10 సార్లు చేయండి. మీరు మీ చేతుల్లో డంబెల్స్ పట్టుకొని కూడా ఈ వ్యాయామం చేయవచ్చు.
బంతిని తిప్పడం అనేది సాధారణ వ్యాయామం. ఇది కూర్చుని లేదా నిలబడి చేయవచ్చు. మొదట మీ చేతిలో టెన్నిస్ బాల్ తీసుకోండి. గట్టిగా పట్టుకోండి. తర్వాత 3 సెకన్ల పాటు వీలైనంత గట్టిగా పిండండి. తర్వాత అది సాధారణ స్థితికి రావాలి. ఈ వ్యాయామం 10 సార్లు చేయండి. అనంతరం బంతిని ఇంకో చేతికి బదిలీ చేయవచ్చు.
ఎక్కువగా కంప్యూటర్ల ముందు కూర్చొనేవారు కచ్చితంగా ఈ వ్యాయామాలు చేయాలి. వారి చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాలి. మణికట్టు బలంగా ఉంటేనే చేతుల్లో బలం ఉంటుంది. వేటినైనా ఈజీగా మోయవచ్చు. రోజూ పైన చెప్పిన వ్యాయామాలు కచ్చితంగా చేయండి. ఫలితం ఉంటుంది.