తెలుగు న్యూస్  /  Lifestyle  /  Five Health Reasons To Avoid Pains Killers In Period Cycle

పీరియడ్స్ సమయంలో.. పెయిన్​ కిల్లర్స్ వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త

20 September 2022, 12:32 IST

    • Period Cramps : పీరియడ్స్ సమయంలో చాలా మంది నొప్పిని భరించలేక పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అయితే ఆ సమయంలో పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లొద్దు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే అవి మరిన్ని సమస్యలను తెస్తాయని.. సహజమైన పద్ధతుల్లోనే పీరియడ్ క్రాంప్స్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. 
పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే జాగ్రత్త
పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే జాగ్రత్త

పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే జాగ్రత్త

Period Cramps : ఋతుస్రావం సమయంలో తిమ్మిరి అనేది మహిళలకు చాలా సాధారణ లక్షణం. దీనికి కారణం తెలియదు కానీ.. ఆ క్రాంప్స్ తగ్గించుకుననేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఇవి తాత్కాలిక రిలీఫ్ ఇస్తాయి కానీ.. భవిష్యత్తులో కొన్ని పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పీరియడ్స్ సమయంలో పెయిన్‌కిల్లర్‌కు వెళ్లే బదులు.. సహజమైన పద్ధతిలో వాటిని తగ్గించుకునేలా చూడాలంటున్నారు నిపుణులు. పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

Foods For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి

కడుపు నొప్పి

మీకు పీరియడ్స్ వచ్చినా.. లేకపోయినా.. ఎక్కువ మాత్రలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది. నొప్పి నివారిణిలు మీ కడుపు లైనింగ్‌ను చికాకు పెట్టే అవకాశముంటుంది. అది మీకు మరింత నొప్పిని కలిగిస్తుంది.

క్రమరహిత హృదయ స్పందన

కొన్ని మందులు మీ గుండెపై ప్రతికూల ప్రభావాలను చూపించవచ్చు. పెయిన్ కిల్లర్స్ స్వల్పకాలిక క్రమరహిత హృదయ స్పందనకు కూడా దారితీస్తాయి.

తలతిరగడం

మీ పీరియడ్స్ సమయంలో తలతిరగడం అనేది సహజంగా ఉండొచ్చు. అయితే ఈ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే పరిస్థితి అధ్వాన్నంగా మారవచ్చు. ఇవి రక్తంలో గ్లూకోజ్, మైకమును ప్రేరేపిస్తాయి.

విరేచనాలు

పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే.. విరేచనాలు అయ్యే ప్రమాదముంది. ఈ సమయంలో ఈ మందులు మీ కడుపుని ఇబ్బంది పెడతాయి. విరేచనాలకు దారితీస్తాయి.

పొట్టలో పుండ్లు

మీ పీరియడ్స్ సమయంలో ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల మీ పొట్ట లేదా పేగుపై పుండ్లు ఏర్పడతాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి మిమ్మల్ని ఆసుపత్రిలో కూడా చేరేలా చేయవచ్చు.

మగత

ఈ మందులు మగత అనుభూతిని కలిగిస్తాయి. ప్రత్యేకించి మీరు పని చేస్తుంటే.. నిద్ర వస్తూ ఉంటుంది. పనిమీద ఫోకస్ చేయాలనుకునేవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

మరి ఏమి చేయాలి..

పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకునే బదులు.. హాట్ కంప్రెస్, యోగా లేదా హెర్బల్ టీ సహాయం తీసుకోవచ్చు అంటున్నారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తున్నారు.

టాపిక్