పీరియడ్స్ ముందు ఈ లక్షణాలు కనిపిస్తే.. ప్రెగ్నెన్సీగా భావించవచ్చా?-early pregnancy symptoms these are the signs of pregnancy in the first week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Early Pregnancy Symptoms These Are The Signs Of Pregnancy In The First Week

పీరియడ్స్ ముందు ఈ లక్షణాలు కనిపిస్తే.. ప్రెగ్నెన్సీగా భావించవచ్చా?

HT Telugu Desk HT Telugu
Aug 20, 2022 09:11 PM IST

Symptoms of pregnancy: గర్భధారణ సమయంలో స్త్రీలందరూ ఒకే విధమైన లక్షణాలను అనుభవిస్తారని అనుకోవడం పొరపాటు. సాధారణంగా మహిళల గర్భాదారణను పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు.

signs of pregnancy
signs of pregnancy

ప్రతి స్త్రీకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులను చూడవచ్చు. గర్భధారణ సమయంలో స్త్రీలందరూ ఒకే విధమైన లక్షణాలను ఉండవు. మహిళల్లో సాధారణంగా గర్భాధారణను వివిధ పరీక్షల ద్వారా నిర్దారిస్తారు. గర్భాదారణలో కనిపించే సాధారణ లక్షణాలతో పాటు కొంత మంది స్త్రీలలో ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. ఋతుస్రావం ముందు కనిపించే కొన్ని గర్భధారణ సంకేతాల అధారంగా ప్రెగ్నెసి నిర్ధారించవచ్చు.

వాంతులు: గర్భం ప్రారంభంలో, మహిళలు ఉదయం నిద్రలేవగానే వాంతులు సమస్య ఉంటుంది. చాలామంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఉదయం పూట మాత్రమే వాంతులు అవుతాయని భావించాల్సిన అవసరం లేదు. ఈ సమస్య రోజులో ఎప్పుడైనా రావచ్చు. ఇది గర్భం దాల్చిన కొన్ని వారాల తర్వాత మాత్రమే కనిపించే సంకేతం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. ఒత్తిడి, ఆహారాల వల్ల కూడా ఈ సమస్య తీవ్రమవుతుంది.

రొమ్ములలో మార్పులు: గర్భం దాల్చిన మొదటి వారాల్లో స్త్రీలు రొమ్ము పరిమాణం, ఆకృతిలో మార్పులను గమనించవచ్చు. ఈ సమయంలో, మహిళలు తమ రొమ్ములు బరువుగా, లేతగా, వాపుగా ఉన్నట్లు భావిస్తారు. ఇది ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లక్షణాలను పోలి ఉంటుంది. సాధారణంగా, రెగ్యులర్ పీరియడ్స్ సమయంలో, మహిళల చనుమొనల రంగు డార్క్‌గా ఉండదు. రొమ్ము పరిమాణంలో తేడా గర్భధారణ సమయంలో ఇది జరుగుతుంది.

అలసట: గర్భం యొక్క ప్రారంభ దశలలో మహిళలు చాలా అలసిపోతారు. ఈ సమయంలో, శారీరక, మానసిక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.

WhatsApp channel