తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్పూనుతో తినకుండా మీ చేతులతోనే మీరు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో జరుగుతుందో తెలుసుకోండి

స్పూనుతో తినకుండా మీ చేతులతోనే మీరు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో జరుగుతుందో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

20 December 2024, 11:00 IST

google News
    • ఇప్పుడు చేతులతో తినడం పాద పద్ధతి అయిపోయింది. స్టైల్ గా స్పూనులతో తినేవారి సంఖ్య పెరిగిపోయింది. కానీ మీ చేతులతో మీరే ఆహారాన్ని తినడం వల్ల ఆయుర్వేదం ప్రకారం ఎన్నో సానుకూల ప్రభావాలు ఉంటాయి.
భోజనం తినే పద్ధతి ఇది
భోజనం తినే పద్ధతి ఇది

భోజనం తినే పద్ధతి ఇది

సనాతన సంప్రదాయాలు నెమ్మదిగా కనుమరుగవుతున్న కాలం ఇది. ఒకప్పుడు నేలపై కూర్చుని తమ చేతులతోనే తినేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ పై కూర్చుని స్పూనుతో తినడం వంటి అలవాట్లు వచ్చాయి. ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని స్పూన్లతో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. మన చేత్తో మనమే తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అందుకే ప్రాచీన కాలం నుంచి ప్రజలు తమ చేత్తో తామే తినడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. ఇది ప్రధానంగా జీర్ణక్రియకు సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది.

అనేక పురాతన సంస్కృతులలో చేతులతో తినడం అనేది ఒకప్పుడు ఉండేది. కానీ సమాజం ఆధునికంగా మారాక మాత్రం చేతితో తినడం అనేది చులకనగా చూసే అలవాటు వచ్చింది. దాంతో ఎంతో మంది స్పూన్ తో ఆహారాన్ని తినడం ప్రారంభించారు. నిజానికి చేతులతో ఆహారాన్ని తినడం వల్ల అవి జీర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం చేతులతో తినేటప్పుడు అయిదు వేళ్లు కలిసి పనిచేస్తాయి. మిగతా నాలుగు వేలు కలిసి బొటనవేలు వైపుగా దగ్గరగా వస్తాయి. ఇది ఒక చేతి సంజ్ఞా లేదా ముద్ర అని చెప్పుకోవచ్చు. జీర్ణ క్రియ కోసం శరీర శక్తిని సమృద్ధిగా పెంచేందుకు ఈ ముద్ర ఎంతో అవసరం.

జీర్ణక్రియ అనేది మన శరీరంలో శక్తిని పెంచే కార్యాకలాపాలలో ఒకటి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ప్రతి చేతి వేలు ఐదు అంశాలను సూచిస్తుంది. బొటనవేలు అగ్నిని, ఇండెక్స్ వేలు గాలిని, మధ్య వేలు అంతరిక్షాన్ని, ఉంగరం వేలు భూమిని, చిన్నవేలు నీటిని సూచిస్తుంది. మనం చేతులతో తినేటప్పుడు ఈ మూలకాలన్నీ కలిసి అంతర్గత శక్తిని అందిస్తాయి. జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

మనం మన చేతులతో ఆహారాన్ని దాటినప్పుడు మనం మెదడుకు శక్తివంతమైన సంకేతాలు వెళ్తాయి. అది మన జీర్ణవ్యవస్థను మరింత ఉత్తేజపరుస్తుంది. ఇంద్రియాలు, చేతులు కలిసి మనసుకి నిండుగా అనిపించేలా ఆహారాన్ని తినే పద్ధతి చేతులతోనే తినడం.

మన చేతి వేళ్లలోని నరాల చివరలు మన జీర్ణ వ్యవస్థతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆహారాన్ని వేలు తాకగానే ఆ నరాలు ఉత్తేజితమవుతాయి. నోటిలో, పొట్టలో ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ప్రక్రియను పెంచుతాయి.

మైండ్ ఫుల్‌గా తినడం అనేది చేతులతో తినడం వల్లే కలుగుతుంది. అనుభూతి చెందుతూ ఆహారాన్ని తినడం అనేది మానసికంగా కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. చేతులతో తినేటప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉన్నా కూడా పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి. హానికరమైన బ్యాక్టీరియా చేతుల ద్వారా నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాగే గోళ్లను కూడా పూర్తిగా కత్తిరించుకోవడం మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

తదుపరి వ్యాసం