తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Ladoos Recipe : ఖోయాతో కొబ్బరి లడ్డూలు.. పండుగకి పర్​ఫెక్ట్ స్నాక్..

Coconut Ladoos Recipe : ఖోయాతో కొబ్బరి లడ్డూలు.. పండుగకి పర్​ఫెక్ట్ స్నాక్..

22 October 2022, 7:24 IST

google News
    • Coconut Ladoos Recipe : ఈ దీపావళికి వివిధ వంటలతో పాటు లడ్డూలు కూడా చేసేందుకు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈసారి కొబ్బరి లడ్డూలు చేసేయండి. పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు.. లేదా మీరు హ్యాపీగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
కొబ్బరి లడ్డూలు
కొబ్బరి లడ్డూలు

కొబ్బరి లడ్డూలు

Coconut Ladoos Recipe : పండుగకైనా.. సులభంగా తయారు చేసుకోగలిగే వంటకాల్లో కొబ్బరి లడ్డూ ఒకటని చెప్పవచ్చు. ఈ కోకోనట్ లడ్డూలను తాజా కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని ఉపయోగించి తయారు చేయవచ్చు. వేడుక ఏదైనా.. ఈ కొబ్బరి లడ్డూ.. మీ పండుగను మరింత రెట్టింపు చేస్తుంది. అయితే వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* ఖోయా - అరకప్పు

* నెయ్యి - 1 టీస్పూన్

* జీడిపప్పు - 10

* బాదం - 10

* కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు

* కండెన్స్‌డ్ మిల్క్- 1 కప్పు

తయారీ విధానం

ముందుగా పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి.. దానిలో ఖోయా వేయాలి. దానిని బాగా కరిగించి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి.. జీడిపప్పు, బాదం వేసి.. బంగారు రంగు వచ్చే వరకు రోస్ట్ చేయాలి. వాటికి పక్కకు తీసి.. దానిలో కొబ్బరి వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో కండెన్స్‌డ్ మిల్క్ వేయండి. బాగా కలిపి.. ఖోయా పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. అది కాస్త చల్లారనిచ్చి.. చిన్న చిన్న గుండ్రని బంతులు చేయండి. కొబ్బరి బాల్స్ మధ్యలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులను ఉంచండి రోల్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం