Fairness Cream Kidney Failure : చర్మ సౌందర్యం కోసం వాడే క్రిములతో కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో నమ్మలేని నిజాలు
17 April 2024, 9:23 IST
- Fairness Cream Cause Kidney Failure : అందంగా ఉండేందుకు ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటాం. అయితే వీటితో కిడ్నీలకు కూడా సమస్యే అని ఓ అధ్యయన చెబుతుంది.
ఫేస్ క్రీముతో కిడ్నీ ఫెయిల్యూర్
స్త్రీ పురుషులిద్దరూ తమను తాము అందంగా కనబరచుకోవడానికి కాస్మోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. సన్ క్రీమ్, స్కిన్ క్రీమ్, ఫౌండేషన్ ఇలా రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించి అందంగా తయారవుతారు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వెనుక ఉన్న ప్రమాదాన్ని ఒక షాకింగ్ స్టడీ వెల్లడించింది.
ఇవే ఫేస్ క్రీములు ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని అధ్యయన నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ క్రీములను అప్లై చేయడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని తెలుస్తోంది. మీరు ఆశ్చర్యపోవచ్చు.. కానీ ఫేస్ క్రీమ్, కిడ్నీకి ఏం దగ్గరి సంబంధం ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది.
స్టడీ ప్రకారం స్కిన్ క్రీమ్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని తేలింది. ఆ క్రీములలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా కిడ్నీలను ప్రభావితం చేసే మెంబ్రేనస్ నెఫ్రోపతీ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది మూత్రపిండాలు పనిచేయకపోవడానికి, మూత్రంలో అదనపు ప్రోటీన్‌ను బయటకు పంపిస్తుంది. మెంబ్రేనస్ నెఫ్రోపతితో బాధపడుతున్న 22 మందిపై ఈ అధ్యయనం జరిగింది. వీరిలో 15 మంది అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో 13 మందికి స్కిన్ బ్యూటీ క్రీమ్స్ వాడిన తర్వాతే లక్షణాలు కనిపించాయని చెప్పారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పరిశోధకులు చెబుతున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఈ రెండు ప్రమాదాలు దాగి ఉండడంతో చాలా మంది షాక్ అవుతున్నారు.
కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అధిక స్థాయిలో పాదరసం ఉన్న స్కిన్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకంలో పెరుగుదల మెంబ్రేనస్ నెఫ్రోపతీ(MN) కేసుల పెరుగుదలకు దారితీసింది. భారతదేశంలో స్కిన్-ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను విరివిగా ఉపయోగించడం వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయని అధ్యయనం సూచిస్తుంది. ఈ క్రీములలో పాదరసం ఎక్కువగా ఉంటుందని, ఇది కిడ్నీ సమస్యలకు నిశ్శబ్ద కారణమని నివేదిక పేర్కొంది.
ఇది కేవలం చర్మం, కిడ్నీ ఆరోగ్య సమస్య కాదు.. ఇది ప్రజారోగ్య సంక్షోభని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదరసం చర్మానికి పూస్తే అటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ హానికరమైన ఉత్పత్తులను నియంత్రించడానికి, ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవలసిన సమయం ఇది అని అంటున్నారు. భారతదేశంలోని నియంత్రణ లేని మార్కెట్ కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి.