TS Govt Jobs 2024 : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే, అర్హతలివే-applications are invited from the eligible candidates for appointment to the various posts in telangana medical colleges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Jobs 2024 : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే, అర్హతలివే

TS Govt Jobs 2024 : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే, అర్హతలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 13, 2024 05:02 PM IST

TS Medical Colleges Jobs 2024 : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో పలు ఉద్యోగాల భర్తీకి(TS Medical Colleges Jobs) నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వివరాలను వెల్లడించింది.

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు (https://dme.telangana.gov.in/)

Telangana Medical Colleges Jobs 2024 : తెలంగాణవ్యాప్తంగా ఉన్న 26 మెడికల్ కాలేజీల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 20 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(Director of Medical Education - Telangana) పేర్కొంది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలు( Medical College Jobs 2024) ఉన్నాయి. ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.కేవలం ఇంటర్వూ పద్ధతిలోనే వీటిని రిక్రూట్ చేస్తామని తెలిపింది. మార్చి 16వ తేదీ ఈ ఇంటర్వూలు ఉంటాయని ప్రకటించింది.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,తెలంగాణ రాష్ట్రం

పోస్టులు - ప్రొఫెసర్, అసోసియేట్ ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్

20 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

రాష్ట్రంలో ఉన్న 26 మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల వెబ్ సైట్ లోకి వెళ్లి ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు.

పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు. ట్యూటర్ పోస్టుకు మాత్రమే ఎంబీబీఎస్ ఉండగా… మిగతా పోస్టులకు ఎండీ కూడా చదవి ఉండాలి. సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులకు తప్ప మిగతా వాటికి పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి - 69 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు - ఆఫ్ లైన్

https://dme.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారమ్ ను నింపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం - కేవలం ఇంటర్వూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.

ఇంటర్వూ తేదీ -మార్చి 16, 2024.

మీరు దరఖాస్తు చేసుకునే కాలేజీలోని ప్రిన్సిపాల్ ఆఫీసులో ఈ ఇంటర్వూలు జరుగుతాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Whats_app_banner