Eye care tips: కంట్లో నలక పడితే ఏం చేయాలి? వైద్య నిపుణుల సలహా ఇదే
22 February 2023, 10:15 IST
- Eye care tips: కంట్లో నలక పడితే ఏం చేయాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక్కడ సవివరంగా చదవండి.
Eye care tips: కంట్లో నలక పడితే ఏం చేయాలి?
కంట్లో నలక పడితే ఏం చేయాలి? దుమ్ము, దూళి లేదా ఇంకేదైనా కంట్లో పడ్డప్పుడు చాలా అసౌకర్యంగా, ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల కంట్లో నలక పడితే వెంటనే కళ్లను రుద్దడం చేయొద్దు. సాధారణంగా కళ్లల్లో ఏది పడినా దురదగా ఉంటుంది. దమ్ము, దూళి, ఇంకేదైనా పడ్డప్పుడు కళ్లు దురద పెడతాయి. కళ్లలోంచి నీళ్లు వస్తాయి. వెంటనే కంటి చుట్టూ నలపడం స్టార్ట్ చేస్తారు. లేదంటే దురద వల్ల గోకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం ఇన్ఫెక్షన్లను ఆహ్వానించడమే అంటున్నారు నేత్ర వైద్య నిపుణులు.
కళ్లు అత్యంత సున్నితమైనవి. మరీ ముఖ్యంగా దుమ్మూ, దూళీ పడ్డప్పుడు కళ్లను శుభ్రపరుచుకోవడం ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో అది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కళ్లలో పడ్డదాన్ని తీయకముందే కళ్లు నలిపితే ప్రమాదకరంగా మారుతుంది. ఏ ఇసుక రేణువో, ఏవైనా గింజల్లో పడ్డప్పుడు వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాలి. ఏవైనా రసాయనాల లాంటివి పడితే మరింత జాగ్రత్త తీసుకోవాలి.
శివమ్ నేత్ర వైద్యశాల వైద్యులు డాక్టర్ విపుల్ మాండవీయ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలను వివరించారు. కంట్లో పడ్డ వాటిని వీలైనంత వరకు చాలా నిధానంగా వెలికి తీయాలని సూచించారు. దుమ్మూదూళీ వంటివి పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
కంట్లో నలక పడ్డప్పుడు పాటించాల్సిన టిప్స్
- చాలా సందర్భాల్లో అద్దం సహాయకారిగా ఉంటుంది. మీ కళ్లను ముట్టుకునేముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వేరే వాళ్లు సాయం చేస్తున్నట్టయితే వారు వారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- కన్నీళ్లు, కను రెప్పలు ఆడించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- వేడి నీటిలో ముంచిన టవల్‌ను వినియోగించడం వల్ల కూడా మీరు మీ కంటి నుంచి దుమ్ము బయటకు రావడానికి వీలుపడుతుంది.
- మీ కంటిని నీటితో నిండి ఉన్న గ్లాసులో ఉంచి గానీ, నీళ్లు చిలకరించడం ద్వారా గానీ కడగాలి. కను గుడ్లను అటూఇటూ తిప్పి చూస్తుండడం వల్ల ఇంకా ఏదైనా మిగిలిపోయిందేమో కనిపిస్తుంది.
- ఇంకా ఏదైనా అలాగే ఉండిపోతే నిపుణుల సహాయం కోసం ప్రయత్నించండి.
- మీ కళ్లను అదిమిపెట్టకుండా కేవలం తుడుచుకోండి.
చన్నీటిని ఉపయోగించండి: డాక్టర్ దివ్యా సింగ్, ఆప్తాల్మాలజిస్ట్
- కంటి నుంచి దుమ్మును తీసేందుకు చన్నీటిని వాడండి. కళ్లను నెమ్మదిగా నీటితో కడుగుతూ దుమ్ము పోయేలా చూడండి. గుప్పిట్లో నీటితో కళ్లు మొత్తం తడిచేలా కడుగుతూ ఉండండి.
- మీ కళ్లను నలపొద్దు. వేడి నీటి గుడ్డతో నెమ్మదిగా తుడుచుకోండి. ఈ ప్రక్రియలో ఎక్కడా కళ్లపై ఒత్తిడి పడొద్దు.
- ఈ సమయంలో కన్నీరు వస్తే మీ కళ్లలోంచి దుమ్మూదూళీ వెళ్లిపోతుంది. కను రెప్పలు కొడుతూ ఉంటే కూడా దుమ్ము బయటకు వెళ్లిపోతుంది.
- వైద్యుడిని సంప్రదించకుండా మెడికల్ షాపులో కంటి చుక్కల మందు కొనకండి. కళ్లు చాాలా సున్నితమైనవని గుర్తించండి. అలాగే కంటిని నష్టపరిచే కాస్మొటిక్స్ ఏవీ వాడకండి. అలాంటి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ చదవండి. రసాయనాలు లేని ఉత్పత్తులు, బ్రాండెడ్ ఉత్పత్తులు వాడండి.
- కళ్లు తుడుచుకునేటప్పుడు చాలా మృధువైన కాటన్ స్వాబ్స్ లేదా కాటన్ క్లాత్ యూజ్ చేయండి. లేదా తడిగా ఉన్న కాటన్ స్వాబ్ వాడండి.
- అద్దం ముందు నిలబడి మీ కళ్లు తెరిచి నెమ్మదిగా మృధువైన కాటన్ స్వాబ్‌తో మీ కళ్లు శుభ్రపరచుకోవచ్చు.
- వైద్యులు సూచించిన ఐ డ్రాపర్‌తో కూడా మీ కంట్లో నలకను తీసేయొచ్చు.
టాపిక్