తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Bonda: ఎగ్ బోండా ఇలా చేసి సాస్‌లో ముంచుకొని తింటే ఆ రుచే వేరు, ఇదిగో సింపుల్

Egg Bonda: ఎగ్ బోండా ఇలా చేసి సాస్‌లో ముంచుకొని తింటే ఆ రుచే వేరు, ఇదిగో సింపుల్

Haritha Chappa HT Telugu

22 May 2024, 15:30 IST

google News
    • Egg Bonda: ఎగ్ బోండా పేరు చెబితేనే నోరూరిపోతుంది. రెండు ఎగ్ బోండాలు తింటే చాలు... సంపూర్ణ భోజనం చేసినంతగా పొట్ట నిండిపోతుంది. దీని రెసిపీ చాలా సులువు.
ఎగ్ బోండా రెసిపీ
ఎగ్ బోండా రెసిపీ

ఎగ్ బోండా రెసిపీ

Egg Bonda: సాయంత్రం పూట అప్పుడప్పుడు ఎగ్ బోండాలను తినండి. ఇది శక్తిని అందిస్తుంది. సాయంత్రం ఎగ్ బోండాలని తింటే రాత్రికి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. తద్వారా బరువు కూడా తగ్గుతారు. ఎగ్ బోండా రెసిపీ చాలా సులువు. దీన్ని ఒక్కసారి చేసుకొని చూడండి... ఈ ఎగ్ బోండాను సాస్‌లో ముంచి తింటే టేస్ట్ అదిరిపోతుంది.

ఎగ్ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

శెనగపిండి - ఒకటిన్నర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

వంట సోడా - చిటికెడు

మిరియాల పొడి - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కారం - అర స్పూను

ఎగ్ బోండా రెసిపీ

1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

3. అందులోనే ఉప్పు, కారం, వంటసోడా వేసి బాగా కలపాలి.

4. బజ్జీల పిండిలా అయ్యేందుకు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

6. నూనె వేడెక్కాక కోడిగుడ్లను శెనగపిండిలో ముంచి వేడెక్కిన నూనెలో వేయాలి.

7. అది బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

8. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ బోండాను రెండు ముక్కలుగా కట్ చేసి పైన కాస్త మిరియాల పొడిని చల్లుకోవాలి.

9. అలా తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా పిల్లలకి మిరియాల పొడి కారంగా అనిపిస్తే టమోటో సాస్ లో అడ్డుకొని తినమన్నా మంచిదే.

సాయంత్రం స్నాక్స్ గా ఎగ్ బోండా బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తిన్నాక చాలాసేపు ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ ఎగ్ బోండాను సాయంత్రం తింటే రాత్రికి అన్నం తినాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఇంకా కోడిగుడ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి పోషకాహార లోపం వస్తుందన్న భయం కూడా లేదు.

తదుపరి వ్యాసం