Stomach Health: పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే ఈ 4 పదార్థాలను కలిపి ఇంటి ఔషధం తయారుచేసి తినేయండి
21 December 2024, 9:30 IST
Stomach Health: చలికాలంలో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతాయి. మీకు పొట్ట ఉబ్బరంగా అనిపించిన వెంటనే కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని రకాల పదార్థాలు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
పొట్ట ఉబ్బరం చిట్కాలు
చలికాలంలో ఆహారం తిన్న తర్వాత చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తిన్న వెంటనే అరగదు. ఒక్కోసారి రాత్రి వరకు అరగకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. పొట్ట ఉబ్బరంగా, భారంగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇవన్నీ అజీర్ణ లక్షణాలు. చలికాలంలో ఒకేచోట కదలకుండా కూర్చోవడానికి, పడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని వల్ల శక్తి ఖర్చు కాదు. అలాగే చలికాంలో జీర్ణ ప్రక్రియ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దీని వల్ల ఆహారం అరగక పొట్ట ఉబ్బరం సమస్య మొదలైపోతుంది. అలాంటప్పుడు ఎక్కువ మందులు వాడేబదులు ఇంట్లోనే ఔషధాన్ని తయారుచేసుకుని తాగితే మంచిది.
చలికాలంలో ఆహారం అరగక పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలను కలిపి తినండి. అజీర్ణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఈ ఆయుర్వేద హోం రెమెడీ సహాయపడుతుంది. ఈ మందును ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.
శీతాకాలంలో ప్రజలు శారీరకంగా తక్కువ చురుకుగా ఉంటారు. అదే సమయంలో స్పైసీ ఆహారాన్ని ఎక్కువగా తింటారు. దీనివల్ల జీర్ణక్రియలో జాప్యం జరుగుతుంది. జీవక్రియ మందగించడం, తక్కువ నీరు త్రాగటం వల్ల… ఉబ్బరం, పుల్లని త్రేన్సులు, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ప్రారంభిస్తారు. చలిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి, తిన్న తర్వాత ఈ నాలుగు పదార్ధాలతో ఔషధాన్ని తయారుచేసేయండి
పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే ఔషధాన్ని తయారు చేయడానికి యాలకులు, సోంపు, నల్ల మిరియాలు, బెల్లం అవసరం పడతాయి. ఈ నాలుగు పదార్థాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక డబ్బాలో దాచుకోవాలి. దీన్ని చిన్న మాత్ర ఆకారంలో చుట్టుకోవాలి. లేదా ఒక స్పూనుతో ఆ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నమిలి తినేయాలి.
ఈ నాలుగింటి పదార్థాలను కలిపి తినడం వల్ల మీ మందగించిన జీవక్రియను సరిచేయడానికి సహాయపడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నిర్వహిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను కలిగించదు.