Stomach Upset: భారీ భోజనాలు తిన్నాక పొట్ట ఉబ్బరంలా అనిపిస్తోందా? వెంటనే ఈ డ్రింక్ తాగేయండి-feeling bloated after eating heavy meals drink this drink immediately ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stomach Upset: భారీ భోజనాలు తిన్నాక పొట్ట ఉబ్బరంలా అనిపిస్తోందా? వెంటనే ఈ డ్రింక్ తాగేయండి

Stomach Upset: భారీ భోజనాలు తిన్నాక పొట్ట ఉబ్బరంలా అనిపిస్తోందా? వెంటనే ఈ డ్రింక్ తాగేయండి

Haritha Chappa HT Telugu
Nov 02, 2024 09:30 AM IST

Stomach Upset: ఒక్కోసారి అతిగా తినేస్తూ ఉంటాము. అలా తినడం వల్ల పొట్టలో ఇబ్బందిగా అనిపిస్తుంది. పొట్ట ఉబ్బరం లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే వేపుడు వంటకాలు అతిగా తిన్నా కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.

డిటాక్స్ డ్రింక్
డిటాక్స్ డ్రింక్ (shutterstock)

పండుగల వచ్చాయంటే రకరకాల వంటకాలతో భోజనాలు ముగిస్తారు. ఒక్కోసారి అతిగా తినేస్తూ ఉంటారు కూడా. అలాగే స్వీట్లు, వేపుళ్లు తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీనివల్ల ఒక్కోసారి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్టలో ఏదో తెలియని ఇబ్బంది. అనేక రకాల ఆహారాలు అతిగా తినడం వల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలే కాదు శరీరంలో కొవ్వు కూడా పెరగడం మొదలవుతుంది. మీరు మీ జీర్ణవ్యవస్థను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలన్నా…ప్రేగులను పూర్తిగా శుభ్రపరచాలనుకున్నా డిటాక్స్ డ్రింక్స్ తాగడం ప్రారంభించండి. ఇక్కడ మేము డిటాక్స్ డ్రింక్స్ రెసిపీలు ఇచ్చాము. వీటిని భారీ భోజనాల అనంతరం తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై పేగులు శుభ్రపడతాయి.

డిటాక్స్ డ్రింక్

బీట్ రూట్, నిమ్మరసం, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పసుపు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేయాలి. అందులో తగినన్ని నీటిని పోయాలి. ఇవన్నీ మెత్తగా అయ్యాక వడపోయకుండానే అలా తాగేయాలి. రుచి గురించి పట్టించుకోకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడమే కాకుండా పేగులను శుభ్రపడతాయి. ఉదయం పరగడుపున కనీసం వారం రోజుల పాటు తాగితే కొద్ది రోజుల్లోనే తేడా కనిపించడం మొదలవుతుంది. మీకు పొట్ట చాలా తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతో ఆరోగ్యంగా కూడా అనిపిస్తుంది. భారీ భోజనాలు తిన్నాక కనీసం అయిదు రోజుల పాటూ మీరు ఈ పానీయం తాగాలి.

నిమ్మరసం-అల్లం నీరు

నూనెలో వేయించి వేపుళ్లు అధికంగా తినడం వల్ల పొట్టలో తిప్పినట్టు, వికారంగా అనిపిస్తుంది. కూర్చోలేక, నిల్చోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, అల్లం రసం కలపాలి. కొద్దిగా నల్ల ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తాగేయాలి. దీని రుచి అంతగా బాగోదు కానీ తాగాల్సిందే. ఈ తాగడం వల్ల పొట్ట ఉబ్బరంసమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సెలెరీ డ్రింక్

సెలెరీ అనేది ఒకరకమైన ఆకుకూర. చూసేందుకు కొత్తిమీరలా ఉంటుంది. ఇది పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అన్ని సూపర్ మార్కెట్లలో ఇది లభిస్తుంది. సెలెరీ ఆకులను మిక్సీలో వేసి బాగా రుబ్బేయాలి. అందులోంచి ఒక టీస్పూన్ సెలెరీని ఒక లీటరు నీటిలో కలిపి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని గోరువెచ్చగా అయ్యాక తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నయం అవుతాయి. అంతేకాదు పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఒక వారం పాటూ ఈ డ్రింక్ తాగి చూడండి, మీకు పొట్ట ఎంత తేలికగా అనిపిస్తుందో అర్థమవుతుంది.

Whats_app_banner