తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Upma Recipe । బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ ఉప్మా రెసిపీ.. డబుల్ రుచి, డబుల్ ఆనందం!

Idli Upma Recipe । బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ ఉప్మా రెసిపీ.. డబుల్ రుచి, డబుల్ ఆనందం!

HT Telugu Desk HT Telugu

15 June 2023, 6:00 IST

google News
    • Idli Upma Recipe: ఇడ్లీ ఉప్మా చేయడం చాలా సులభం, క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తినవచ్చు.
Idli Upma Recipe
Idli Upma Recipe (istock)

Idli Upma Recipe

Breakfast Recipes: మీరు రెగ్యులర్‌గా తినే ఇడ్లీలను తినడంతో విసుగు చెందితే ఇడ్లీలను మరో వంటకంగా మార్చి తినవచ్చు. మీరు కొన్నిచోట్ల ఇడ్లీలతోనే మిరపకాయ ఇడ్లీ, ఇడ్లీ ఫ్రై, ఇడ్లీ మంచూరియన్, మసాలా ఇడ్లీ, ఖీమా ఇడ్లీ అంటూ వివిధ రకాలుగా చేయడం చూసి ఉంటారు. అయితే అలా కాకుండా ఇడ్లీలతో ఉప్మా చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది, మీకు రుచికరమైన అల్పాహారం సిద్ధమవుతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ ఇడ్లీలు చేసినట్లయితే లేదా ఇడ్లీలు మిగిలిపోయినట్లే ఈ ఇడ్లీ ఉప్మా రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఇడ్లీ ఉప్మా చేయడం కూడా చాలా సులభం, క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తినవచ్చు. ఎలా చేయాలో ఈ కింద చూచనలు చదవండి.

Idli Upma Recipe కోసం కావలసినవి

  • 5- 6 ఇడ్లీలు
  • 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 1 టీస్పూన్ శనగపప్పు
  • 1 టీస్పూన్ మినపపప్పు
  • 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ
  • 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు
  • 1 ఉల్లిపాయ
  • 1 టీస్పూన్ అల్లం తురిము
  • 1 రెమ్మ కరివేపాకు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1/4 టీస్పూన్ పసుపు
  • 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
  • ఉప్పు రుచికోసం

ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలి

  1. ముందుగా ఇడ్లీలను తీసుకొని ముక్కలుగా కట్ చేయండి లేదా వాటిని పిసికి మెత్తని పిండిలాగా విడివిడిగా చేయండి.
  2. అనంతరం బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయించండి. ఆపై పప్పులను వేసి రంగు వచ్చేవరకు వేయించాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు వేసి బాగా కలిపుతూ వేయించండి.
  4. ఆ తర్వాత ఇడ్లీ ముక్కలు, కొత్తిమీర వేసి ప్రతిదీ బాగా కలపండి. ఇడ్లీలు వేడిగా మారే వరకు మూతపెట్టి ఉడికించాలి.

అంతే ఇడ్లీ ఉప్మా రెడీ. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఓసారి తిని చూడండి.

తదుపరి వ్యాసం