Foxtail Millet Idli Recipe । కొర్రల ఇడ్లీలు.. రెగ్యులర్‌గా తినే ఇడ్లీల కంటే మరింత ఆరోక్యరమైనవి!
Foxtail Millet Idli Recipe: ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ అనేది ఇడ్లీకి మరింత ఆరోగ్యకరమైన వెర్షన్. ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీ రెసిపీని ఈ కింద చూడండి.
Healthy Breakfast Recipes: ఇడ్లీ ఎంతో మంది ఇష్టపడే ఒక ఆరోగ్యకరమైన సౌత్ ఇండియన్ అల్పాహారం. ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ అనేది ఇడ్లీకి మరింత ఆరోగ్యకరమైన వెర్షన్, ఈ రెసిపీ ఫాక్స్‌టైల్ మిల్లెట్, మినపప్పుతో తయారు చేస్తారు. ఈ రెండూ ఆరోగ్యకరమైన ఆహార దినుసులు.
మిల్లెట్‌లు అనేవి అత్యంత చిన్నని గడ్డిజాతి ధాన్యాలు. ఇవి రుచికరమైనవే కాకుండా, చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి, చెడు కొలెస్ట్రాల్ ఉండదు అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది.
మిల్లెట్లలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఫాక్స్‌టైల్ మిల్లెట్ కూడా ఒకటి, మనం సాధారణంగా కొర్రలు అని పిలుస్తాము. ఈ కొర్రలలో కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఆస్వాదించడానికి ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీని సర్వ్ చేయండి. దీని రెసిపీని ఈ కింద చూడండి.
Foxtail Millet Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు కొర్రలు
- 1-1/2 కప్పులు మినపపప్పు
- 1 టీస్పూన్ మెంతులు
- ఉప్పు రుచికి తగినంత
ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం
- ముందుగా కొర్రలను ఒక గిన్నెలో తీసుకోని నీటిలో బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి, మరోవైపు మరొక గిన్నెలో మినపపప్పు, మెంతులను కూడా రాత్రంతా నానబెట్టాలి. వీటిని వేర్వేరుగా కనీసం 8 గంటలు నానబెట్టాలి.
- ఇప్పుడు ఇడ్లీ పిండిని తయారు చేయడానికి, నానబెట్టిన కొర్రలు, మినపపప్పును తీసుకొని నీటిని తీసేయాలి. ఆపై వేర్వేరుగా తగినంత నీరు పోసుకొని మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. మినపపప్పు పిండిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి.
- రుబ్బుకున్న కొర్రల పిండి, మినపపప్పు పిండిని కలిపి మృదువుగా మారేంత వరకు పులియబెట్టండి. ఈ పిండిని 5 నుండి 6 గంటలు పులియబెట్టండి. అప్పుడు మీకు ఇడ్లీ బ్యాటర్ సిద్ధమవుతుంది.
- సిద్ధమైన ఇడ్లీ బ్యాటర్ ను ఇడ్లీ కుక్కర్ అచ్చులలో వేసి ఆవిరి మీద ఉడికించాలి.
- 10 నిమిషాలు ఆవిరిలో ఉడికించిన తర్వాత తెరిచి చూస్తే కొర్రల ఇడ్లీలు రెడీ అవుతాయి.
ఈ ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీని సాంబార్, చట్నీతో అద్దుకొని తింటూ ఉదయం మీ అల్పాహారాన్ని ఆస్వాదించండి.
సంబంధిత కథనం