తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Honey Sesame Seeds Benefits : తేనె, నువ్వులు మిక్స్ చేసి తినండి.. నెల రోజులు తర్వాత ఫలితం చూడండి

Honey Sesame Seeds Benefits : తేనె, నువ్వులు మిక్స్ చేసి తినండి.. నెల రోజులు తర్వాత ఫలితం చూడండి

Anand Sai HT Telugu

17 February 2024, 18:30 IST

    • Honey Sesame Seeds Benefits : తేనె, నువ్వులు మిక్స్ చేసి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నెల రోజులపాటు ఇవి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
తేనె నువ్వులు కలిపి తింటే ప్రయోజనాలు
తేనె నువ్వులు కలిపి తింటే ప్రయోజనాలు (Unsplash)

తేనె నువ్వులు కలిపి తింటే ప్రయోజనాలు

ఉద్యోగం, సంతోషకరమైన కుటుంబం, స్నేహితులు ఉంటే సరిపోదు కదా.. ఆరోగ్యం కూడా ఉండాలి. జీవితం మీకు ఇచ్చిన ఆనందాన్ని మీరు అనుభవించలేరు. కోరుకున్నది తినలేక.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం లేని వ్యక్తికి, ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదు. ఆరోగ్యం ఉంటేనే అదృష్టం. ఆరోగ్యవంతమైన శరీరమే నిజమైన సంపద.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మన శరీరం నిరంతరం సూక్ష్మజీవులతో దాడి చేయబడుతుంది. కానీ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. కానీ కొన్ని వ్యాధులు చాలా ప్రాణాంతకమైనవి, కొన్ని క్షణాల్లో మనిషి జీవితాన్ని అంతం చేస్తాయి. వాటి నుంచి కాపాడుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని సరిగా చూసుకోవాలి. అందుకే చిన్న విషయాల్లోనూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.

ఖాళీ కడుపుతో తీసుకోవాలి

ఆరోగ్య సంరక్షణ చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో సాధారణ పదార్థాలు సరిపోతాయి. అయితే వాటిని క్రమం తప్పకుండా అనుసరించడం చాలా ముఖ్యం. కనీసం ఏడు రకాల వ్యాధుల నుండి రక్షించడానికి ఒక టేబుల్ స్పూన్ తేనె, నువ్వులను కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం చేయాలి.

ఎముకలు బలంగా తయారవుతాయి

నువ్వులు, తేనెలో పోషకాలు, ప్రోటీన్లు, కాల్షియం తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కాల్షియాన్ని ఎముకలు గ్రహించేందుకు తేనె సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. ఎముకలు బలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.

నువ్వులు, తేనె కలిపి తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కలయికలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇందులోని హార్మోన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే అనేక మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎనర్జీని పెంచుతాయి. వ్యాయామం, ఎక్కువ దూరం నడవడం వంటి హార్డ్ వర్క్ కోసం బయటకు వెళ్లే ముందు తింటే మీరు అలసిపోరు.

పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి

పీరియడ్స్ సమయంలో స్త్రీలు అనుభవించే పొత్తికడుపులో నొప్పిని తగ్గించడానికి ఈ మిశ్రమం అద్భుతమైనది. ఇందులోని పోషకాలు గర్భాశయ గోడల వాపును తగ్గించి, తిమ్మిరిని తగ్గించే గుణం కలిగి ఉంటాయి.

మీరు బరువు తగ్గడంలో బిజీగా ఉంటే ఈ మిశ్రమం మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాన్ని అనవసరంగా తీసుకోకుండా చేస్తుంది. తద్వారా బరువు పెరగకుండా చేస్తుంది.

చర్మం, జుట్టుకు ఉపయోగకరం

తేనె, నువ్వులలోని ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కణాల పెరుగుదలకు సహాయపడతాయి. తద్వారా ఆరోగ్యకరమైన చర్మం, మంచి హెయిర్ పొందడానికి సహాయపడతాయి.

తేనె, నువ్వుల మిశ్రమంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు రక్త ప్రసరణను పెంచి మెదడు శక్తిని పెంచుతాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి మొదలైన సామర్థ్యాలు పెరుగుతాయి. అందుకే ఒక నెల రోజులుపాటు కొద్ది మెుత్తంలో తేనె, నువ్వులు కలిపి తీసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

తదుపరి వ్యాసం