తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  After Meals: భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి

After Meals: భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి

Haritha Chappa HT Telugu

16 September 2024, 14:00 IST

google News
    • After Meals: భోజనం తిన్నాక చాలామందికి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అది హానికరమైనది. కానీ చిన్న బెల్లం ముక్క నెయ్యిలో ముంచుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నెయ్యిలో ముంచి బెల్లం తినడం వల్ల లాభాలు
నెయ్యిలో ముంచి బెల్లం తినడం వల్ల లాభాలు

నెయ్యిలో ముంచి బెల్లం తినడం వల్ల లాభాలు

After Meals: భోజనం చివరిలో చిన్న స్వీట్ ముక్క తినాలన్న కోరిక ఎక్కువ మందిలో పుడుతుంది. అన్నం తిన్నాక స్వీట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీటు పంచదారతో చేసింది అయితే మరీ ప్రమాదం. కాబట్టి చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

బెల్లం, నెయ్యి... రెండూ కూడా మన భారతీయ వంటకాలలో ముఖ్యమైనవి. వాటిని సాంప్రదాయ ఔషధాలుగా కూడా వినియోగిస్తారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఈ విషయాన్ని ఆయుర్వేదం నిర్ధారిస్తోంది.

ఆయుర్వేదం ప్రకారం...

ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల శరీరంలో ఉన్న ఎన్నో దోషాలు సమతుల్యంగా అవుతాయి. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది.

నెయ్యి భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే పోషకాల శోషణను కూడా మెరుగుపరుస్తుంది. వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇక బెల్లం విషయానికొస్తే కాస్త తీపిగా ఉండే ఈ పదార్థం ఖనిజాలతో నిండి ఉంటుంది. కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి నెయ్యి, బెల్లం రెండూ కలిపి తినడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగా బెల్లం, నెయ్యి ఉంటాయి. కాబట్టి భోజనానంతరం నెయ్యి బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఎంత బెల్లం తినాలి?

బెల్లం తినమన్నాం కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకండి. చిన్న ముక్క తింటే చాలు నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది ఎముకలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడగడతాయి. బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ ఎ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెరుగైన జీవక్రియకు మద్దతునిస్తాయి. బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇక బెల్లం లోని ఉండే సహజ చక్కెర స్థిరమైన శక్తిని శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. శుద్ధి చేసిన చక్కెర ఒకేసారి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. బెల్లం మాత్రం స్థిరంగా కొంచెం కొంచెంగా శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి పద్ధతి. బెల్లం శక్తివంతమైన డీ టాక్సీఫికేషన్ గా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో విషాన్ని బయటికి పంపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి, బెల్లం కలిపి తినేందుకు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం