Nuts for one Month: ఒక నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం గుప్పెడు నట్స్ తినండి మార్పును మీరే గమనించండి
13 May 2024, 9:30 IST
- Nuts for one Month: ఆరోగ్యకరమైన ఆహారంలో నట్స్ కూడా భాగమే. సమతుల్య ఆహారంలో భాగంగా నట్స్ కూడా తినమని చెబుతారు. వైద్యులు ఒక నెల రోజులపాటు ప్రతిరోజూ నట్స్ తిని మీలో వచ్చే మార్పును గమనించండి.
నట్స్ తో ఆరోగ్యం
Nuts for one Month: నట్స్ అంటే జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, బాదం, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని పరగడుపున తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నట్స్ అన్నింటినీ కలిపి ఒక గుప్పెడు ప్రతిరోజూ ఉదయం తినేందుకు ప్రయత్నించండి. ఇలా ఒక నెల రోజులు పాటు తినండి చాలు. ఆ తర్వాత మీలో వచ్చే మార్పులను మీరే గమనించండి. ఈ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.
గుండెకు రక్షణ
నట్స్‌లో ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఈ గింజల్లో సెలీనియం, విటమిన్ ఈ, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవన్నీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. చర్మ కణాలను, శరీర కణాలను రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.
బరువు తగ్గేందుకు
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ గుప్పెడు నట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో క్యాలరీలు నిండుగా ఉంటాయి. కాబట్టి గుప్పెడు తిన్నా కూడా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. ఆకలిని కూడా ఇవి నియంత్రిస్తాయి. కాబట్టి శరీర బరువు త్వరగా తగ్గుతారు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు నట్స్ ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో ముందుంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
మెదడు ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్, బాదం వంటివి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ప్రతిరోజూ గుప్పెడు గింజలను ఆహారంలో భాగం చేసుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుంది. క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోసవ్యాధులతో అకాలమరణం పొందకుండా ఇవి రక్షిస్తాయి.
టాపిక్