తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Skin Care Routine : చలికాలంలో సహజమైన పద్ధతుల్లో మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి..

Winter Skin Care Routine : చలికాలంలో సహజమైన పద్ధతుల్లో మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి..

05 November 2022, 14:21 IST

    • Winter Skincare : చలికాలం వచ్చేసింది. ఈ సమయంలో చర్మం సమస్యలు చాలా ఎక్కువైపోతాయి. అదే పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి చలికాలంలో చర్మం మృదువుగా, సున్నితంగా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
చర్మ సంరక్షణ చిట్కాలు
చర్మ సంరక్షణ చిట్కాలు

చర్మ సంరక్షణ చిట్కాలు

Winter Skincare : చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. హీటర్‌లు, బ్లోయర్‌లు శీతాకాలంలో మనకి చలి నుంచి రక్షణినిస్తాయి. అసలు చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే.. అబ్బా స్వర్గం భూలోకానికి దిగివచ్చిందా అనిపిస్తుంది. కానీ ఈ సౌఖ్యాలన్నీ మీ చర్మం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. బాహ్య, సరైన అంతర్గత పోషణ లేకపోవడం వల్ల దురద, పొడి, పొడిబారిన చర్మ సమస్యలు మరింత పెంచుతుంది.

ఈ సమస్యను పోగొట్టుకుని.. ఈ చలికాలంలో మన చర్మం మెరుస్తూ ఉండాలంటే.. చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మృదువుగా, ఆరోగ్యంగా ఉండే చర్మం పొందడానికి కొన్ని సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సహజమైన చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మాయిశ్చరైజ్ చేయండి

చలికాలంలో మెరిసే చర్మాన్ని పొందాలంటే.. మాయిశ్చరైజింగ్ అనేది చాలా ముఖ్యమైన దశల్లో ఒకటి. ఇది మన చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది. చర్మం దాని సహజ నూనెను కోల్పోకుండా చూసుకుంటుంది. కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె, మజ్జిగ, కీరదోసకాయలు వంటి సహజమైన మాయిశ్చరైజర్‌లను ఎంచుకోవచ్చు.

* నీరు తాగండి..

చలికాలంలో తక్కువ నిర్జలీకరణం అనుభూతి చెందడం వల్ల మనం నీరు తక్కువగా తీసుకుంటాము. అయినప్పటికీ మనకు తెలియకుండానే.. మన శరీరంలోని నీటిని చాలా రకాలుగా కోల్పోతాము. కాబట్టి నీటిని కచ్చితంగా తీసుకోవాలి. ఇది మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

* స్నానానికి గోరువెచ్చని నీరే మంచిది..

చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే బాగానే ఉంటుంది. కానీ మీ చర్మ పరిస్థితికి వేడి నీరు అధ్వాన్నంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటే ప్రభావాలు మరింత ప్రతికూలంగా ఉంటాయి. అలా అని చల్లని నీటితో స్నానం చేయలేము. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. అప్పుడు మీకు చలి వేయదు. పైగా మీ చర్మం సహజ నూనెలు కోల్పోకుండా ఉంటుంది.

* నైట్ స్కిన్ కేర్

మీరు ఆరోగ్యకరమైన చర్మాన్ని కావాలనుకుంటే.. మీరు దాదాపు 8 గంటల పాటు నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో మీరు స్కిన్ కేర్ తీసుకోవాలి. దీనివల్ల మీరు మృదువైన చర్మాన్ని పొందుతారు.

ఈ సులభమైన చిట్కాలు పాటించడం వల్ల.. మీ చర్మం శీతాకాలంలో కూడా మృదువుగా ఉంటుంది. కఠినమైన ప్రభావాలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది.