తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinks For Low Cholesterol: పరిగడుపున ఈ 5 పానీయాలతో చెడు కొలెస్ట్రాల్‌ కట్‌..

Drinks for Low Cholesterol: పరిగడుపున ఈ 5 పానీయాలతో చెడు కొలెస్ట్రాల్‌ కట్‌..

HT Telugu Desk HT Telugu

22 November 2023, 6:30 IST

google News
  • Drinks for Low Cholesterol: ఉదయాన్నే పరిగడుపున కొన్ని పానీయాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు అదుపులో ఉంటాయి. వాటిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కొలెస్ట్రాల్ తగ్గించే పానీయాలు
కొలెస్ట్రాల్ తగ్గించే పానీయాలు (pexels)

కొలెస్ట్రాల్ తగ్గించే పానీయాలు

కొలస్ట్రాల్‌ మన శరీరానికి కొంత మొత్తంలో అవసరం. అయితే దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొలస్ట్రాల్‌ అయితే మరొకటి చెడు కొలస్ట్రాల్‌. జంక్‌ఫుడ్‌, నూనెల్లో వేయించిన పదార్థాల్ని అతిగా తినడం వల్ల ఇది మన శరీరంలోకి చేరిపోయి అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంది. అందుకనే ఈ చెడు కొలస్ట్రాల్‌ని ఎవ్వరైనా సరే కరిగించుకోవాల్సిందే. లేదంటే గుండె జబ్బుల్లాంటివి వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. అందుకు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటివి తప్పకుండా చేయాలి. అయితే ఇలాంటి వారు రోజూ పరగడుపునే కొన్ని పానీయాలను తాగడం వల్ల ఉపయోగం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్‌ మీల్‌ స్మూతీ:

ఓట్స్‌ని నానబెట్టి మిక్సీలో వేయండి. వాటిలో కొద్దిగా పండ్ల ముక్కలు, పెరుగు వేయండి. కావాలనుకుంటే కాస్త తేనెనూ చేర్చండి. వీటన్నింటినీ బాగా మిక్సీ చేయండి. అవసరం అయితే కాస్త నీటిని పోసి మరోసారి మిక్సీ చేయండి. ఓట్‌ మీల్‌ స్మూతీ రెడీ అవుతుంది. దీన్ని ఉదయపు అల్పాహారంలో భాగంగా తాగేయండి. దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అది కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో సహకరిస్తుంది.

గ్రీన్‌ టీ:

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ ఎంతగానో సహకరిస్తుంది. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల ఫలితాలు రెట్టింపు అవుతాయి.

కమలా పండ్ల రసం:

ఇప్పుడు కమలా పండ్లు ఎక్కువగా దొరుకుతున్నాయి. మూడు, నాలుగు కమలా పండ్లను తీసుకుని చక్కగా రసం తీసుకోండి. దీనిలో విటమిన్‌ సీ, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని శరీరం నుంచి తగ్గించివేయడానికి పనికి వస్తాయి.

బ్లాక్‌ టీ:

చాలా మంది తేయాకులతో డికాక్షన్‌ పెట్టుకుని దానిలో పాలు, పంచదార వేసి టీ తయారు చేసుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలని అనుకునే వారు ఇలా ఉదయం చేసుకునే టీలో పాలు, పంచదారల్ని మానేయండి. కేవలం టీ పొడి ఒక్కటే వేసుకుని బ్లాక్‌ టీ తాగండి. ఇది కొవ్వుల్ని సమర్థవంతంగా తగ్గించగలదు.

యాపిల్‌ సైడర్ వెనిగర్‌:

కొలెస్ట్రాల్‌ని తగ్గించి వేయడంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ చక్కగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదయాన్నే ఓ గ్లాసుడు నీటిని తీసుకోండి. అందులో కాస్త యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, ఒక స్పూనుడు తేనెల్ని వేసి బాగా కలపండి. పరగడుపున దీన్ని తాగేయండి. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

తదుపరి వ్యాసం