Dosakaya roti Pachadi: దోసకాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే అన్నంలో అదిరిపోతుంది, ఇది అమ్మమ్మల నాటి స్టైల్ పచ్చడి
01 June 2024, 11:30 IST
- Dosakaya roti Pachadi: దోసకాయ రోటి పచ్చడి ఒకప్పుడు అధికంగా తినేవారు. పూర్వం ఇదే ఎంతో మంది ఫేవరెట్. ఇప్పుడు దీన్ని చేయడం వచ్చినవారి సంఖ్య తక్కువే.
దోసకాయ రోటి పచ్చడి రెసిపీ
Dosakaya roti Pachadi: దోసకాయతో చేసే వంటకాలు తక్కువే అయినా అవి చాలా రుచిగా ఉంటాయి. పూర్వం అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంలో దోసకాయ పచ్చడిని ఎక్కువగా చేసేవారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది. కాబట్టి పూర్వం ఈ చట్నీకి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మంచిది. ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.
దోసకాయ రోటి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దోసకాయ - ఒకటి
దోశ గింజలు - రెండు స్పూన్లు
చింతపండు - ఉసిరికాయ సైజులో
ఎండుమిర్చి - ఎనిమిది
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - ఒక స్పూను<
జీలకర్ర - ఒక స్పూను
శనగపప్పు - అర స్పూను
మినప్పప్పు - అర స్పూను
దోసకాయ రోటి పచ్చడి రెసిపీ
1. దోసకాయను కోసి అందులోని గింజలను వేరు చేయాలి.
2. దోసకాయ ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో దోసకాయ గింజలను వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని వేసి వేయించాలి.
6. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఎండుమిర్చి, దోసకాయ గింజలు, కాస్త ఉప్పు వేసి రోట్లో దంచుకోవాలి.
8. అందులోనే చింతపండును కూడా వేసి దంచాలి.
9. అలాగే దోసకాయ ముక్కలను వేసి బాగా దంచుకోవాలి.
10. ఈ మిశ్రమం కచ్చాపచ్చాగా అయ్యాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దంచాలి.
11. ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
12. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి.
13. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, సెనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపు వేసుకోవాలి.
14. ఆ మొత్తం మిశ్రమాన్ని దోసకాయ రోటి పచ్చడిపై వేయాలి.
15. అంతే టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంలో వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.
16. దోసకాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు.
పూర్వం ఈ పచ్చడిని అధికంగా తినేవారు. దోసకాయని ఇందులో మనం ఉడికించడం వంటివి చేయము కాబట్టి అందులోని పోషకాలు అన్నీ సంపూర్ణంగా బయటికి పోకుండా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకసారి మీరు దోసకాయ రోటి పచ్చడి ఇంట్లో ప్రయత్నించి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.