Curry Leaves: కూరలో కరివేపాకులు ఎందుకు వేయాలి? ఈ విషయాలు తెలిస్తే రోజూ కరివేపాకులు తింటారు
- curry leaves: కరివేపాకులను చులకనగా చూస్తారు కానీ, వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆహారానికి రుచి, సువాసనను అందించడమే కాదు, శరీరానికి పోషకాలనూ ఇస్తాయి.
- curry leaves: కరివేపాకులను చులకనగా చూస్తారు కానీ, వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆహారానికి రుచి, సువాసనను అందించడమే కాదు, శరీరానికి పోషకాలనూ ఇస్తాయి.
(1 / 5)
కరివేపాకులు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.(Freepik)
(2 / 5)
కరివేపాకులను ప్రతిరోజూ ఉదయం గుప్పెకు తీసుకుని నోట్లో వేసుకుని నమిలేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పేగు కదలికలను చురుగ్గా మారుస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ రాకుండా అడ్డుకుంటుంది. (Freepik)
(3 / 5)
కరివేపాకులు తినేవారిలో జుట్టు అధికంగా పెరుగుతుంది. జుట్టు సమస్యలేవీ రాకుండా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ తినడానికి ముందు అరగంట ముందు కరివేపాకులను నమిలి తినాలి. జుట్టు రాలడం తగ్గుతుంది. (Freepik)
(4 / 5)
కరివేపాకులు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటికి పోతాయి. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. మొటిమలు వంటివి రావడం కూడా తగ్గుతుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు