తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Water In Winter । ఉదయం పూట గుండెపోటు.. నీరు తాగాలంటున్న వైద్యులు!

Drinking Water in Winter । ఉదయం పూట గుండెపోటు.. నీరు తాగాలంటున్న వైద్యులు!

HT Telugu Desk HT Telugu

17 November 2022, 21:07 IST

    • Drinking Water in Winter - Mornings: నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం అని మనకు తెలుసు, కానీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇది నిజమేనా, ఎందుకు ఇలా? తెలుసుకోండి ఇక్కడ.
Drinking Water in Winter Mornings
Drinking Water in Winter Mornings (Unsplash)

Drinking Water in Winter Mornings

మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే నీరు తాగాలి. నీరు తాగకుండా ఎవరూ ఉండలేరు. కానీ రోజులో ఎంత నీరు తాగాలి, ప్రతిసారి నీరు తాగటానికి మధ్యలో ఎంత వ్యవధి ఉండాలి? త్రాగే విధానం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవి తెలియకపోతే మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు.

దాహం వేసినప్పుడల్లా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఈ చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు. నీరు తాగటం అనేది మరిచిపోతాం, తక్కువ నీరు త్రాగడం వల్ల, మనం డీహైడ్రేషన్ బారిన పడతాము, ఇది మన అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు తాగాలి.

అయితే సరైన సమయంలో నీరు తాగడం ద్వారా ఊబకాయం, తలనొప్పి, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలను అధిగమించవచ్చని మీకు తెలుసా? మన శరీరంలో చాలా వరకు నీరే ఉంటుంది. అందువల్ల సరైన సమయంలో, సరైన మోతాదులో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నీటి అవసరం ఉంటుంది. సమయం, ప్రదేశం, సీజన్ ప్రకారంగా మన తాగే నీటి మోతాదులో ఎక్కువ, తక్కువలు ఉండవచ్చు. అయితే రోజులో తాగిల్సిన నీరు అంతా ఒకేసారి కూడా తాగకూడదు. ఒకేసారి 3-4 గ్లాసుల నీరు త్రాగవలసిన అవసరం లేదు, ప్రతి కొన్ని గంటలకు అవసరం మేరకు తాగుతూ ఉండాలి.

నిద్రలేచిన వెంటనే నీరు తాగాలి.. Drinking Water in Winter Mornings

రాత్రిపూట మనం పడుకున్న తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది, కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి, లేకపోతే రక్తం చిక్కగా మారి గుండెకు రవాణ అయ్యే మార్గంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది గుండెపోటుకు దారితీయవచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అయితే నిలబడి తాగకూడదు, నీటిని కూడా ఒక ఆహారంగానే పరిగణిస్తారు. కాబట్టి మనం ఆహారాన్ని ఏవిధంగా అయితే కూర్చుండి తింటామో నీటిని కూర్చుండి తాగాలనే ఒక ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే అని డాక్టర్లు అంటున్నారు. నీరు కూర్చొని తాగినా, నిల్చుని తాగినా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, హడావిడిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

వేడి నీరు తాగాలా? చల్లని నీరు తాగాలా?

నిస్సందేహంగా, రిఫ్రిజిరేటర్ నుండి తీసిన చల్లని నీరు తాగటం ఆరోగ్యానికి హానికరం. ఏడాది పొడవునా, వేసవిలో కూడా గది ఉష్ణోగ్రత వద్ద నీరు త్రాగాలని డాక్టర్ సలహా ఇస్తున్నారు. అయితే చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు తాగటం శ్రేయస్కరం అని సూచించారు.

నీరు ఎప్పుడు త్రాగకూడదు?

పండ్లలో చాలా నీరు ఉంటుంది, కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. అదే విధంగా, అన్నం తిన్న తర్వాత కూడా నీరు త్రాగడం మంచిది కాదు, ఎందుకంటే అన్నం తయారుచేసినప్పుడు అది చాలా నీటిని గ్రహిస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో 30 నిమిషాల విరామం తీసుకున్న తర్వాత నీరు తాగాలి అని వైద్యులు పేర్కొన్నారు.

టాపిక్