తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  C Section Delivery: సిజేరియన్ ప్రసవం వల్ల నడుము నొప్పి వస్తుందా? ఎందుకు వస్తుంది?

C section Delivery: సిజేరియన్ ప్రసవం వల్ల నడుము నొప్పి వస్తుందా? ఎందుకు వస్తుంది?

Haritha Chappa HT Telugu

12 December 2024, 10:47 IST

google News
  • C section Delivery: సిజేరియన్ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తుందని ఫిర్యాదు చేస్తారు. ఇలా ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ ప్రసవం జరిగితే నడుము నొప్పి ఎందుకు రాదు?

సిజెరియన్ లో నడుము నొప్పి ఎందుకు వస్తుంది?
సిజెరియన్ లో నడుము నొప్పి ఎందుకు వస్తుంది?

సిజెరియన్ లో నడుము నొప్పి ఎందుకు వస్తుంది?

ఎంతో మంది మహిళలకు సిజేరియన్ ద్వారా బిడ్డ పుడితే నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి వస్తుందని చెబుతూ ఉంటారు. సాధారణ ప్రసవం జరిగిన మహిళల్లో ఇలాంటి నొప్పి రాదు, కానీ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగితే మాత్రం నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి అనస్థీషియా నిపుణులు ఏమి చెబుతున్నారు? వెన్నునొప్పి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

సిజేరియన్ వల్ల నడముు నొప్పి వస్తుందా?

అనస్థీషియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం, సిజేరియన్ సమయంలో వెన్నెముకలోకి అనస్థీషియా ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది పెద్ద సూదిని వాడతారు. నేరుగా వెన్నెముకలోకి దీన్ని గుచ్చుతారు. శస్త్రచికిత్సలో భాగంగా పొట్టపై కోత పెట్టి బిడ్డను బయటకు తీసి, తిరిగి కుట్లు వేస్తారు. ఆ నొప్పి వారికి తెలియకుండా ఉండేందుకు అనస్థీషియా ఇస్తారు. ఇలా వెన్నెముకకు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే నడుము నొప్పి వస్తుందని ఎంతో అభిప్రాయపడుతున్నారు. ఇది పూర్తిగా అపోహేనని అంటున్నారు వైద్యులు.

సిజేరియన్ తర్వాత మహిళల్లో కటిలో తీవ్రమైన నొప్పి రావడం సర్వసాధారణం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

- వెన్నునొప్పికి ప్రధాన కారణం శరీరం భంగిమలో మార్పు. గర్భధారణ సమయంలో గర్భాశయం బరువు నడుముపై పడుతుంది. దీనివల్ల తుంటి ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. కటి నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి డెలివరీ తర్వాత కూడా వస్తూ పోతూ ఉంటుంది. డెలివరీ తర్వాత కూర్చునే పద్ధతి సరిగా ఉండేలా చూసుకోండి.

- ప్రసవ సమయంలో చాలాసార్లు వెన్నెముక నరాలు విస్తరిస్తాయి. దీనివల్ల కూడా నడుము భాగంలో నొప్పిని కలిగిస్తుంది.

- డెలివరీ తర్వాత ఎంతో మంది బెడ్ రెస్ట్ లోనే ఉంటారు. ఇలా చిన్న చిన్న పనులు చేయకుండా విశ్రాంతిలోనే ఉంటే నడుము నొప్పి పెరుగుతుంది.

అలాగే చాలా మంది మహిళల్లో విటమిన్ డి లోపం ఉంటుంది. ఇది కూడా వెన్నునొప్పిని పెంచుతుంది. అనస్థీషియా వల్ల దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉండదు.

ఇలా జాగ్రత్తలు తీసుకోండి

- తల్లి పాలిచ్చేటప్పుడు మీరు కూర్చునే భంగిమ లేదా పడుకునే భంగిమపై శ్రద్ధ వహించండి. వీపుకు సపోర్టు ఇచ్చేలా దిండు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఆహారం ఇవ్వడం వల్ల తుంటి ఎముకలు మరింత సున్నితంగా మారతాయి. ఈ బలహీనమైన కండరాలు నొప్పి పెట్టడం ప్రారంభమవుతాయి.

- సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిన తరువాత కొన్ని రోజులకు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అవసరం. కదలకుండా ఒకేచోట కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయడకూదు. నిద్రపోవడం లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి పెరుగుతుంది.

- శస్త్రచికిత్స తర్వాత వెంటనే మీ తుంటి, కోర్ కండరాలను బలోపేతం చేయండి. బరువు శిక్షణ, బలం శిక్షణ వంటి వ్యాయామాలు చేయండి, ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది.

- పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అవసరమైతే సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. అవసరమైన విటమిన్లు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

తదుపరి వ్యాసం