Ugadi Pachadi Benefits : ఉగాది పచ్చడి శరీరానికి ఎంతో మంచిది.. కచ్చితంగా తీసుకోండి
08 April 2024, 14:10 IST
- Ugadi Pachadi Health Benefits Telugu : ఉగాది అనగానే మెుదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. హిందూవులు కచ్చితంగా ఈ పండుగ రోజున పచ్చడి చేసుకుని తీసుకుంటారు. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఉగాది పచ్చడి ప్రయోజనాలు
జీవితంలో సంతోషాలు ఎలా ఉంటాయో, దు:ఖాలు కూడా అంతే. ఉగాది పండుగ కుడా అదే విషయాన్ని చెబుతుంది. అయితే ఉగాది పచ్చడి చేసుకోవడంలో సాంప్రదాయం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరు రకాల రుచులు అనేక ఉపయోగాలను అందిస్తాయి. ఇందులో ఉపయోగించే బెల్లం, చింతపండు రసం, మామిడి, వేప, కారం, ఉప్పు.. అన్నీ మీకు మంచి చేసేవే. ప్రత్యేకంగా వేప, బెల్లం కలిపి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు పొందుతారు.
వివిధ రకాలుగా శరీరంలో వ్యాధులు వేళ్లూనుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు కొన్నిసార్లు మనం అనారోగ్యం పాలవుతాం. కొన్నిసార్లు వైరస్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మన అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వివిధ సంక్లిష్ట వ్యాధులు శరీరంలో గూడు కట్టడం ప్రారంభిస్తాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మొదట జీవన విధానానికి శ్రద్ధ వహించాలి.
ఉగాది రోజున కలిపి తీసుకునే బెల్లం, వేప పువ్వు మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న వివిధ రకాల విష పదార్థాలను తొలగించేందుకు ఈ హోం రెమెడీకి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వేపలో పెద్ద మొత్తంలో ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన టాక్సిన్స్‌ను తక్షణమే తొలగిస్తాయి. ఫలితంగా ఏ వ్యాధికి అవకాశం ఉండదు.
వేపలో ఉండే ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు కడుపులో ఉండే లెక్కలేనన్ని హానికరమైన సూక్ష్మజీవులను చంపుతాయి. ఫలితంగా, జీర్ణక్రియకు సంబంధించిన వివిధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
బరువు తగ్గాలని నిశ్చయించుకున్న వారు ఈ వేప, బెల్లం మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే ఈ ఔషధం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వును కాల్చే శరీర సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా కొవ్వు త్వరగా కరుగుతుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
ఉగాది పచ్చడి గ్యాస్ట్రోప్రొటెక్టివ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. ఇది కడుపు పుండు అవకాశాలను పూర్తిగా తగ్గిస్తుంది. కడుపు పూతలతో బాధపడుతున్న రోగులు కూడా దీనిని తీసుకోవచ్చు. మీరు ప్రయోజనం పొందుతారు.
వేప, బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించడమే కాకుండా, వివిధ వ్యాధులను తగ్గించడం ద్వారా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అధిక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఏ రకమైన గాయమైనా త్వరగా నయం చేయడానికి ఇది గొప్పది. వేప, బెల్లం రెండూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఉగాది పచ్చడిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. వాపు సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
మామిడి అనేది సీజనల్ ఫుడ్, ఏదైనా సీజనల్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎండలో బెల్లం నీరు తాగడం చాలా మంచిది. ఎండలో అలసటను త్వరగా తగ్గిస్తుంది. నల్ల మిరియాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అజీర్ణం, డిప్రెషన్, దగ్గు మొదలైన వ్యాధులను నివారించే శక్తి ఉంది. ఉగాదిలో చేసే పచ్చడి చాలా ప్రత్యేకం. అందుకే ఉగాది పచ్చడి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.