తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushrooms: రోజుకు ఐదు పుట్టగొడుగులు తినడం ద్వారా ఎన్ని రోగాల నుంచి తప్పించుకోవచ్చో తెలుసా? కొత్త అధ్యయన ఫలితాలు ఇదిగో

Mushrooms: రోజుకు ఐదు పుట్టగొడుగులు తినడం ద్వారా ఎన్ని రోగాల నుంచి తప్పించుకోవచ్చో తెలుసా? కొత్త అధ్యయన ఫలితాలు ఇదిగో

Haritha Chappa HT Telugu

07 December 2024, 11:00 IST

google News
    • Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దీన్ని తరచూ తినే వారి సంఖ్య తక్కువే. పుట్టగొడుగులు తినడం ద్వారా ఎన్నో రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని కొత్త అధ్యయనం చెబుతుంది.
పుట్టగొడుగులతో ఆరోగ్యం
పుట్టగొడుగులతో ఆరోగ్యం (Pexel)

పుట్టగొడుగులతో ఆరోగ్యం

పుట్టగొడుగులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం పుట్టగొడుగులను ప్రతిరోజూ తింటే ఎన్నో రకాల రోగాల నుంచి బయటపడవచ్చు. రోజుకు ఐదు పుట్టగొడుగులు వండుకొని తింటే చాలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మతిమరుపు వంటి వ్యాధులను దూరం ఉంచవచ్చు.

అన్ని పుట్టగొడుగులు తినదగినవి కాదు. ఆరోగ్యానికి మేలు చేసే, తినడానికి వీలుగా ఉండే పుట్టగొడుగులని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాటిని తినడం వల్ల మన శరీరానికి మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అమెరికాలోని పెన్ స్టేట్ సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రోడక్ట్ ఫర్ హెల్త్ సంస్థకు చెందిన పరిశోధకులు రోజుకు ఐదు చిన్న పుట్టగొడుగులను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో కనిపెట్టారు.

గుండె కోసం పుట్టగొడుగులు

పరిశోధకులు చెబుతున్న ప్రకారం పుట్టగొడుగులు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఆ యాంటీ ఆక్సిడెంట్లు మన గుండెకు రక్షణగా నిలుస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు పెరగకుండా కూడా అడ్డుకుంటాయి. కాబట్టి వీలైనంతగా ప్రతిరోజు ఆహారంలో ఐదు పుట్టగొడుగులను తినేలా ప్లాన్ చేసుకోండి. ఒక వ్యక్తికి ఐదు పుట్టగొడుగులు తినాలంటే నలుగురు ఉన్న కుటుంబంలో 20 పుట్టగొడుగులను కూరగా వండాలి. దాని ప్రకారం ప్రతిరోజు వీలైనంతవరకు పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకునేందుకు ట్రై చేయండి.

ఐదు పుట్టగొడుగులు కొన్ని మిల్లీగ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. భారతీయ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చడం చాలా సులభం. ఆమ్లెట్ లో భాగంగా లేదా ఉప్మాలో భాగంగా వీటిని కలిపి వండవచ్చు. లేదా కూరల్లో కూడా భాగం చేయవచ్చు. మష్రూమ్ మసాలా కర్రీ వంటివి కూడా వండవచ్చు. మష్రూమ్ కూరలు, అన్నం, రోటీలతో కూడా టేస్టీగా ఉంటాయి. బిర్యానీలో పులావ్ లో కూడా పుట్టగొడుగులను వేసి వండేయవచ్చు. ఎలాగైనా సరే పుట్టగొడుగులను తినడం అనేది ముఖ్యం.

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 13 రకాల వేర్వేరు జాతులకు చెందిన పుట్టగొడుగులపై పరిశోధనలు చేశారు. అవన్నీ కూడా మనుషులు తినడానికి సురక్షితమైనవే. అన్నింటిలోనూ ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. ముఖ్యంగా సెలీనియం, ఏర్గోథియోనిన్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైనవి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ రెండూ ముందుంటాయి. ఈ రెండింటి కోసమే పుట్టగొడుగులను ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవాలి.

పుట్టగొడుగుల్లో పోషకాలు దట్టంగా ఉంటాయి. ముఖ్యంగా బి కాంప్లెక్స్, పొటాషియం వంటివి దీనిలో నిండుగా ఉంటాయి. బి కాంప్లెక్స్ మాత్రలు వాడే కన్నా పుట్టగొడుగులు తినడం వల్ల బి విటమిన్లు పుష్కలంగా అందుతాయి. మెదడుకు, ఎముకల ఆరోగ్యానికి పుట్టగొడుగులు చేసే మేలు ఇంతా అంతా కాదు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు రాకుండా మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకోండి.

పుట్టగొడుగుల అలెర్జీ

అయితే పుట్టగొడుగులు అందరికీ సరిపడవు. మీకు పుట్టగొడుగుల అలెర్జీ లేకపోతేనే వాటిని తీసుకోండి. పుట్టగొడుగుల అలెర్జీ కొంతమందిలో ఉంటుంది. తినగానే చర్మంపై దద్దుర్లు రావడం, వాంతులు కావడం, విరేచనాలు కావడం వంటివి కలుగుతాయి. అలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీకు పుట్టగొడుగుల అలెర్జీ ఉందని అర్థం.

తదుపరి వ్యాసం