Intimate Health: భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడేందుకు జంకుతున్నారా? ఈ సూచనలు ఫాలో అవండి.. ఎంజాయ్‍మెంట్ పెరుగుతుంది!
15 November 2024, 19:17 IST
- Intimate Conversations: జీవిత భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడేందుకు చాలా మంది సిగ్గుపడతారు, జంకుతారు. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. అయితే, ఆ విషయాల గురించి మాట్లాడుకుంటేనే శృంగార జీవితం మెరుగ్గా ఉంటుంది. వాటి గురించి మచ్చటించుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.
భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడేందుకు జంకుతున్నారా? ఈ సూచనలు ఫాలో అవండి.. ఎంజాయ్‍మెంట్ పెరుగుతుంది!
శృంగారం అనేది జీవిత భాగస్వాముల మధ్య ముఖ్యమైన విషయం. ఇది శారీరక చర్యగానే కాకుండా బంధం బలపడేందుకు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. జీవితంలో సంతృప్తి కలిగిస్తుంది. అయితే, చాలా మంది శృంగారం గురించి జీవిత భాగస్వామితో మాట్లాడేందుకు జంకుతారు. సిగ్గుపడి అంత అనుకూలంగా ఫీల్ అవరు. అయితే, జీవిత భాగస్వాముల మధ్య శృంగారంపై ముచ్చట్లు కూడా జరిగితేనే ఆ చర్యలో ఎంజాయ్‍మెంట్ మరింత ఎక్కువవుతుంది. శృంగారం గురించి భాగస్వాములు ఒకరికొకరు మాట్లాడేందుకు ఈ సూచనలు పాటించండి.
మీరే ఆ మాటలు మొదలుపెట్టండి
శృంగారం గురించి మాట్లాడుకోవాలని జీవిత భాగస్వాములు ఇద్దరికీ ఉన్నా ఈ విషయంలో చాలా మంది మౌనంగా ఉంటారు. ఆ విషయాలు మాట్లాడితే తన పార్ట్‌నర్ తన గురించి ఏమనుకుంటారోనని ఫీల్ అవుతారు. అందుకే శృంగారం గురించి మొదట ఎవరో ఒకరు మాటలు మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మాటలు కలుస్తాయి. అందుకే జంకకుండా ఈ విషయాలపై ముందుగా మీరే చర్చ ప్రారంభించండి.
నమ్మకాన్ని ఏర్పరచాలి
మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలకు, వారు చెప్పే విషయాలకు మీరు విలువనిస్తారని, జడ్జ్ చేయరని మీరు నమ్మకాన్ని ఏర్పరచాలి. ఇద్దరు పార్ట్‌నర్స్ మధ్య ఇలాంటి వాతావరణం ఉంటే ఎలాంటి విషయాలపై అయినా చర్చించుకునేందుకు అనుకూలంగా ఫీల్ అవుతారు. అందుకే లైంగిక విషయాల గురించి చర్చ సాగేందుకు ఏమనుకుంటారో అనే భయం లేని నమ్మకం, అభిప్రాయలపై గౌరవం ఉండడం చాలా ముఖ్యం.
వినడం నేర్చుకోవాలి
జీవిత భాగస్వామి ఏం చెబుతున్నారో వినడం చాలా ముఖ్యం. తొందరపడి ఓ అభిప్రాయానికి రావడమో, భంగం కలిగించడమో చేయకుండా వారి ఫీలింగ్స్, కోరికలు పూర్తిగా వినాలి. ఎమోషన్లను అర్థం చేసుకోవాలి. దీంతో ఆ విషయంపై చర్చ అర్థవంతంగా సాగుతుంది.
సూటిగా.. స్పష్టంగా..
శృంగారం గురించి చర్చల్లో అన్ని విషయాలను సూటిగా, స్పష్టంగా చెప్పుకోవాలి. శృంగారం ఎలా ఇష్టం, హద్దులు ఏంటి, అంచనాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకోవాలి. దీంతో ఆ తర్వాత ఎలాంటి అభిప్రాయ భేదాలు రావు. మీ కోరికలు ఏవి ఉన్నా భాగస్వామికి చెప్పేయాలి.
పరస్పర గౌరవం
శృంగారం గురించి మీ జీవిత భాగస్వామి చెప్పిన విషయాలను, ఇష్టాలను, యాక్టివిటీలను, హద్దులను మీరు గౌరవించాలి. పరస్పర అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఇద్దరి శృంగార జీవితం అర్థవంతరంగా, రసవత్తరంగా ఉంటుంది. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు పార్ట్‌నర్స్ ఇద్దరూ తమ ఇష్టాలను, హద్దులను పంచుకోవడం చాలా ముఖ్యం.