తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valantine's Day: ప్రేమ కేరాఫ్ మెదడు.. ఏది నిజమైన, శాశ్వతమైన ప్రేమ? సైకాలజిస్ట్ విశ్లేషణ

Valantine's Day: ప్రేమ కేరాఫ్ మెదడు.. ఏది నిజమైన, శాశ్వతమైన ప్రేమ? సైకాలజిస్ట్ విశ్లేషణ

HT Telugu Desk HT Telugu

14 February 2024, 8:58 IST

google News
    • Valantine's Day: అందరూ ప్రేమిస్తారు. కానీ నిజమైన, శాశ్వతమైన ప్రేమ ఎలా గుర్తించాలి? నిజమైన ప్రేమలో ఏముంటుంది? ప్రేమికుల దినోత్సవం రోజు సైకాలజిస్ట్ బి.కృష్ణభరత్ విశ్లేషణ ఇదీ.
Valentines Day: ఏది నిజమైన ప్రేమ? ఏది శాశ్వతమైన ప్రేమ?
Valentines Day: ఏది నిజమైన ప్రేమ? ఏది శాశ్వతమైన ప్రేమ? (REUTERS)

Valentines Day: ఏది నిజమైన ప్రేమ? ఏది శాశ్వతమైన ప్రేమ?

అప్పుడెప్పుడో గజినీ సినిమాలో సూర్య, ఆసిన్‌లు "హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది.. " అంటూ ప్రేమ గీతం పాడుకుంటే అందరూ ఫిదా అయ్యారు. ప్రేమ మనిషిలో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. సైకాలజిస్టులు మాత్రం ఈ అంశమైన దృష్టి సారించారు.

న్యూయార్క్ లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్ పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రేమలో ఉన్న వారికి ప్రేయసి లేదా ప్రియురాలు ఫోటో చూపించినప్పుడు మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా( వీటిఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్ మ్యాగ్నెటిక్ రిసోనన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారు.

తొలి రోజుల్లో..

వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా రివార్డ్ సిస్టంలోని కీలకమైన ప్రాంతం. నూతన ప్రేమికుల్లో ఈ ప్రాంతం బాగా ఉత్తేజితమవుతుందని పరిశోధనలో తేలింది. వెంట్రల్ పల్లీడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు 20 ఏళ్ల తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండటానికి కారణమని తెలుస్తుంది.

వెంట్రల్ పల్లీడియం అటాచ్‌మెంట్ హార్మోన్లను రిలీజ్ చేసి బంధం నిలబడేటట్లు చేస్తుంది. దీర్ఘకాలిక ప్రేమికుల్లో రఫే న్యూక్లియస్ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ చేసి బంధంలో కుదురుకునేటట్లుగా చేస్తుంది.

ప్రేమ భావన ఎలా వృద్ధి చెందుతుంది?

మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుందని న్యూరోసైన్ చెప్తుంది. మెదడులోని హిప్పో క్యాంపస్, మీడియల్ ఇన్సుల, యాంటీరియర్ సింగ్లేట్ భాగాలు రివార్డ్ సిస్టంలో ప్రధాన పాత్ర పోషించి ప్రేమ అనే భావన వృద్ధి చెందేలా చేస్తాయని పరిశోధనలో తేలింది.

ఏడు రంగుల వాన...

నేటి యువత ప్రేమ అని అనుకుంటున్నది ప్రేమ కాదు. కేవలం వ్యామోహం మాత్రమే. నిజమైన ప్రేమ అంటే ఏమిటో సైకాలజిస్ట్ స్టర్న్ బెర్గ్ తన త్రిముఖ ప్రేమ సిద్ధాంతంలో వివరించారు.

ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నట్లే ప్రేమకు మౌలికాంశాలు అయిన సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధత కలయికలతో 7 రకాల ప్రేమలు పుడతాయని ఆయన వివరించారు.

లైకింగ్, ఇన్‌ఫ్యాట్, లవ్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్ అని ఏడు రకాల ప్రేమలు ఉంటాయని వివరించారు. వీటన్నిటిలోనూ కంజుమెట్ లవ్ అనేది అతి ముఖ్యమైనది.

నేటి యువత రొమాంటిక్ లవ్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధత కలగలిసిన ప్రేమే నిజమైనది, శాశ్వతమైనది.

దాన్ని సాధించడం ఎంత కష్టమో నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ప్రేమ స్వరూపాన్ని, పరిపూర్ణత్వాన్ని అర్థం చేసుకున్న వారికి అది ఒక ఎమోషన్ లా కాకుండా, మోటివేషన్ లా పనిచేస్తుంది. ప్రేమ సఫలమైనా, విఫలమైనా జీవితంలో ముందుకు తీసుకు వెళుతుంది.

-బి.కృష్ణభరత్, సైకాలజిస్ట్

నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఏపీఏఇండియా

సైకాలజిస్ట్ బి.కృష్ణ
తదుపరి వ్యాసం