తెలుగు న్యూస్  /  Lifestyle  /  Coconut Milk Pulao Is Cool Lunch Meal During Summer, Check Recipe Inside

Coconut Milk Pulao Recipe । కొబ్బరిపాల పులావ్.. ఒంటికి చలువ చేసే లంచ్ రెసిపీ!

HT Telugu Desk HT Telugu

27 May 2023, 12:37 IST

    • Coconut Milk Pulao Recipe: వేసవికాలంలో కొబ్బరి పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరిపాలతో తయారు చేసే కొబ్బరిపాల పులావ్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
Coconut Milk Pulao Recipe
Coconut Milk Pulao Recipe (unsplash)

Coconut Milk Pulao Recipe

Healthy Summer Recipes: వేసవికాలంలో వేడివేడి ఆహారం తినాలంటే అంతగా ఆసక్తి ఉండదు. ఒంటికి చలువ చేసే చల్లని ఆహారాలను తినాలనే కోరిక కలుగుతుంది. ఈ వేడి కాలంలో తినదగిన ఆరోగ్యకరమైన వంటకాలు చాలానే ఉన్నాయి. అందులో కొబ్బరిపాలతో తయారు చేసే కొబ్బరిపాల పులావ్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.

కొబ్బరి పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఒక గ్లాసు తాజా కొబ్బరి పాలను తాగడం వల్ల మీ శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, డైరీ మిల్క్‌తో పోలిస్తే ఇది మీ కడుపులో తేలికగా ఉంటుంది. కొబ్బరి పాల పులావ్ సులభంగా, రుచికరంగా ఎలా చేయవచ్చో ఈ కింద సూచనలను అనుసరించండి.

Coconut Milk Pulao Recipe కోసం కావలసినవి

  • 2 కప్పుల కొబ్బరి పాలు
  • 1 కప్పు బాస్మతి బియ్యం
  • 1 క్యారెట్
  • 4-5 బీన్స్
  • 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 tsp జీలకర్ర / జీరా
  • 2 ఏలకులు
  • 1 అంగుళాల దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • ½ టీస్పూన్ సోంపు
  • 1 బిరియాని ఆకు
  • కొన్ని జీడిపప్పులు
  • 1 ఉల్లిపాయ
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1/2 స్పూన్ ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర

కొబ్బరిపాల పులావ్ తయారీ విధానం

  1. ముందుగా బియ్యంను కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టండి.
  2. మొదటగా కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఫెన్నెల్, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
  3. ఆపైన జీడిపప్పు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేంతవరకు వేయించాలి.
  4. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. ఆపైన క్యారెట్ ముక్కలు, బీన్స్, బఠానీలు వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి.
  6. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి, ఆపైమ నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.
  7. మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చేలా మూతపెట్టి ప్రెషర్ మీద ఉడికించాలి.
  8. చివరగా కొత్తిమీర ఆకులు చల్లి గార్నిష్ చేయాలి.

అంతే, కొబ్బరిపాల పులావ్ రెడీ, రైతా లేదా గ్రేవీతో కలిపి తింటూ ఆస్వాదించండి.